Politics

వైసిపి నాయకులు జనాగ్రహ దీక్షలు

టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజు కూడా దీక్షలు జరుగుతున్నాయి.   సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.  అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యే పద్మావతి, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ...

Read More »

‘100 కోట్ల’ వ్యాక్సినేషన్‌ పై ప్రధాని మోడీ

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ‘భారత్ సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమిష్ట స్పూర్తి,  భారత సైన్సు, ఎంటర్ ప్రైజ్ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లకు, నర్సులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ ని ట్విట్ ...

Read More »

ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం అక్టోబరు 21 న నిర్వహిస్తామని ఎపి డిజిపి గౌతం సవాంగ్‌ తెలిపారు. బుధవారం గౌతం సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామన్నారు. సమాజ శ్రేయస్సు, భద్రత కోసం పోలీసులు పని చేస్తారని అన్నారు. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు పని చేస్తారని అన్నారు. గత సంవత్సరం పోలీసులకు కోవిడ్‌ కారణంగా ఒక ఛాలెంజ్‌ ఎదురయ్యిందని, పోలీసులు కోవిడ్‌ ...

Read More »

రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం ...

Read More »

దత్తపీఠంలో అమ్మవారిని దర్శించుకున్న జగన్‌

జగన్‌ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు.  మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని, మేయర్ బాగ్యలక్ష్మి  తదితరులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు.

Read More »

సచివాలయ ఉద్యోగులకు జగన్‌ గుడ్‌న్యూస్‌

విజయ దశమి రోజు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సెక్రటేరియట్‌, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరించారు.. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించిన సీఎం జగన్… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ...

Read More »

స్టేజ్‌పై కిందపడ్డ అచ్చెన్నాయుడు

స్వాంతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టర్‌ కవర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టర్‌ కవర్‌ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తోపాటు ఎంపి రామ్మోహన్‌నాయుడు , అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అప్పటికే వేదికపై సోఫాలో రామ్మోహన్‌నాయుడు కూర్చొన్నారు. ఈ తర్వాత అచ్చెన్న కూర్చోగానే సోఫా ఒక్కసారిగా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్‌నాయుడు కిందపడిపోయారు. వెంటనే భధ్రతా సిబ్బంది ఇరువురినీ పైకి లేపారు.

Read More »

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ,  వెల్లంపల్లి శ్రీనివాస్,  పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

Read More »

ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

రేపు ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రానున్న సందర్భంగా.. ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులు సోమవారం పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ (రెవిన్యూ) డాక్టర్‌ కె.మాధవిలత, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం)కె.మోహన్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌ చంద్‌ లు పరిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవిలత ఆదేశించారు. మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని ...

Read More »

భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేష్‌ సంపాదన 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్‌లో టాప్‌ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ...

Read More »