Politics

మళ్లీ వైసీపీ పార్టీలో చేరనున్న అంబటి రాయుడు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన పోస్ట్ పెట్టాడు. సిద్ధం అంటూ అంబటి రాయుడు ఆసక్తికర పోస్టు పెట్టి పెను సంచలనానికి దారి తీశాడు. ఇటీవల వైసిపి పార్టీలో చేరిన అంబటి రాయుడు… ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. తర్వాత జనసేన పార్టీని పొగుడుతూ… వ్యవహరించాడు. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ… మళ్లీ వైసీపీ పార్టీకి పాజిటివ్గా ట్వీట్ ...

Read More »

ఢిల్లీకి చేరుకున్నCM రేవంత్.. MP టికెట్ ఆశవహుల్లో తీవ్ర ఉత్కంఠ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీఈసీ మీటింగ్‌లో రేవంత్, భట్టి, ఉత్తమ్ పాల్గొననున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై ...

Read More »

తొలిసారిగా ఎమ్మెల్యే బరిలో అనురాధ

మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లే అనురాధను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె తండ్రి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇంటర్ వరకు చదివిన ఆమె మొదటిసారి 2021లో కె. కోటపాడు మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు.

Read More »

మేమంతా సిద్ధం: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ...

Read More »

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విజయవాడ, విశాఖ జనసేన నేతలు

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, విజయవాడ జనసేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి బత్తిన రాము నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికారు. విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు గండూరి మహేశ్, సందెపు జగదీశ్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి తదితరులు ...

Read More »

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు

అనకాపల్లి లోక్ సభ స్థానానికి అభ్యర్థిని వైసీపీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించింది. ఇప్పటి వరకు వైసీపీ 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఈ స్థానంలో ముత్యాలనాయుడిని నిలబెట్టారు. ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి మార్చారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ను ఈర్లి అనురాధకు ఇచ్చారు. ముత్యాలనాయుడు కూతురే అనురాధ. బూడి ముత్యాలనాయుడు కొప్పుల వెలమ ...

Read More »

కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా ఆప్ నిర‌స‌న‌లు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట‌యి ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ అరెస్టు అక్ర‌మం అంటూ ఆప్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌వారం ఢిల్లీ వ్యాప్తంగా నిర‌స‌న‌కు దిగారు. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేజ్రీవాల్ వెంట‌నే రాజీనామా చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కాషాయ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా చేప‌ట్టాయి.

Read More »

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం

శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద హిందూపురం లోక్‌స‌భ, అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ తనను ఖరారు చేసినా.. చంద్రబాబు తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కూటమిలో భాగంగా తమకు ఎక్కడ మైనారిటీ ఓట్లు పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ప్రక్రియ మొదలుపెట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ...

Read More »

ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్..

ఢిల్లీ లిక్కరీ కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు… కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో… ఆమెను తీహార్ జైలుకు పోలీసులు తరలించబోతున్నారు.

Read More »

ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో తనకు పరిచయమే లేదని పేర్కొన్నారు. అయితే, ఆయన బంధువులు మాత్రం తమ ఊళ్లోనే ఉన్నారన్న విషయం మాత్రం తనకు తెలిసిందన్నారు. అసలు ఈ కేసులోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రబెల్లితో తనకు సంబంధం ...

Read More »