Politics

వయస్సులో నేను చాలా చిన్నోడిని’.. సీఎం జగన్

వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రంలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో గురువారం సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా ...

Read More »

YS వివేకా హత్య వెనుక చంద్రబాబు, బీటెక్ రవి హస్తం: MLA రవీంథ్రనాధ్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై వైసీపీ ఎమ్మెల్యే రవీంథ్రనాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా హత్య వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, బీటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యపై సీఎం జగన్ ఇచ్చిన వివరణ టీడీపీకి చెంప పెట్టులాంటిందని అన్నారు. కడప జిల్లా ప్రజలకు అసలు వాస్తవాలు ఏంటో తెలుసన్నారు. వివేకా హత్యపై సీఎం జగన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలను అర్థం ...

Read More »

‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీ నాయకత్వం కోరినా ఈ కారణంగానే తిరస్కరించానని ఆమె వెల్లడించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారని తెలిపారు. అయితే వారం, పది రోజులు ఆలోచించి పోటీ చేయడం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని ఆమె ...

Read More »

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. ఈ తరుణంలో మహబూబ్నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ ...

Read More »

రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర

రెండోరోజు నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి రాత్రికి నాగలపురంలోనే బస చేయనున్నారు.

Read More »

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో ...

Read More »

విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. “చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను పెద్దమొత్తంలో దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు దాడి చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలియగానే ఎల్లో బ్రదర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. దొరికింది వాళ్ల బ్రదరే అయినా, అతడు దొరికిపోయాడు కాబట్టి అతడిని మన ...

Read More »

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇదే?

రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్‌. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...

Read More »

ప్రొద్దుటూరులో బహిరంగ సభ

కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్నారు సీఎం జగన్‌. అభిమాన నాయకుడ్ని చూసేందుకు అబిమాన గణం పోటెత్తుతున్నారు. కాసేపట్లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు రానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

Read More »

తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్:కొొడాలి నాని

గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతున్నారని విమర్శించారు.

Read More »