Technology

సత్య నాదెళ్ల వార్షిక ఆదాయం అక్షరాలా 305 కోట్లు

satya nadella networth

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్‌ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్‌ డాలర్లు) స్టాక్‌ ఆప్షన్స్‌ కింద లభించింది. 2017–18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు ...

Read More »

ఫోర్బ్స్ జాబితా: దేశంలోనే సంపన్నులు వీరే

forbes india rich list 2019

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతానికి దేశంలోనే అత్యంత ధనవంతుడైన కుబేరుడిగా ఉన్నారు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ’ విడుదల చేసిన భారతీయ సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఆయన నికర ఆస్తుల విలువ 51.4 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ తెలిపింది. జియో టెలికాం ద్వారా ముఖేష్ తన ఆస్తులను ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు పెంచుకోవడం గమనార్హం.ఇక ముఖేష్ అంబానీ తర్వాత రెండో స్థానంలో పారిశ్రామికవేత్త గౌతం అదానీ నిలిచారు. ...

Read More »

ఆన్లైన్ లో పేమెంట్ చేస్తున్నారా…?

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అందరూ ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్ లోనే కొంటున్నారు. ఒక మొబైల్ కొనాలన్నా లేక ఒక టి‌వి కొనాలన్న లేదా బట్టలు కొనాలన్నాకూడా ప్రస్తుతం అందరూ ఈ కామర్స్ వెబ్సైట్ లపైనే ఆధారపడుతున్నారు. పైగా పండుగలకి ఈ కామర్స్ వెబ్సైట్ లు ప్రకటించే ఆఫర్ల కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు. అక్టోబర్ పండుగల నెల కావడంతో ఈ కామర్స్ వెబ్సైట్ లు కూడా మరిన్ని ఆఫర్ల తో ముందుకొచ్చాయి. అయితే ఇదే అదునుగా చూసుకున్న హ్యాకర్లు తమ ప్రతాపాన్ని ...

Read More »

Redmi 8 వచ్చేసింది..ఆఫర్ కూడా అదుర్స్!

Redmi 8 వచ్చేసింది..ఆఫర్ కూడా అదుర్స్!

భారత స్మార్ట్ ఫోన్ రంగంలో నంబర్ వన్ అయిన షావోమి మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ ను తీసుకువచ్చేసింది. ఈ సంవత్సరం మార్చిలో ఆ సంస్థ విడుదల చేసిన రెడ్ మీ 7కు తర్వాతి వెర్షన్ అయిన రెడ్ మీ 8 నేడు(అక్టోబర్ 9) భారత మార్కెట్లోకి వచ్చేసింది. మరి దీని ఫీచర్లేంటి? ధర ఎంత? ఈ ఫోన్ తో ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లేంటి అని తెలుసుకుందామా మరి! రెడ్ మీ 8 మొబైల్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 ...

Read More »

Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?

Jio బాటలోనే Airtel, Vodafone కూడా! అక్టోబర్ 14న ఏం జరగబోతోంది?

ప్రస్తుతం టెలికాం రంగంలో యుద్ధం జరుగుతోంది. కాల్ చార్జీల గురించో, డేటా పరిమితి గురించో, రీచార్జ్ మొత్తాల గురించో అనుకుంటున్నారా? కాదు. రింగ్ టైమ్ గురించి. రింగ్ టైమ్ అంటే.. మీరు వేరే వారికి ఫోన్ చేసినప్పుడు మీ కాల్ లిఫ్ట్ చేయడానికి మీ నెట్ వర్క్ అవతలి నెట్ వర్క్ వారికి ఇచ్చే సమయం. అంటే వారి ఫోన్ రింగయ్యే సమయం. ఇందులో ఏముంది.. దీని కోసం ఎందుకంతలా గొడవలు పడటం అంటారా? అక్కడే ఉంది అసలు సంగతి. మీరు వేరే నెట్ ...

Read More »

OnePlus 7T Pro వచ్చేస్తోంది! ఎప్పుడు? ధర ఎంత? స్పెసిఫికేషన్లేంటి?

OnePlus 7T Pro వచ్చేస్తోంది

వన్ ప్లస్ సిరీస్ లో తాజాగా వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 7టీ. ఈ సంవత్సరం మేలో విడుదలైన వన్ ప్లస్ 7కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను విడుదల చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ లోనే వన్ ప్లస్ 7టీ ప్రోని కూడా విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చినా దానికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా ఆ ఈవెంట్ లో తెలపలేదు. అయితే అమెజాన్ వెబ్ సైట్ లో అమెజాన్ 7టీ సిరీస్ కు సంబంధించిన పేజ్ ఒకటి ప్రత్యక్షమైంది. ...

Read More »

Oppo ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఇంకా అయిపోలేదు!

Oppo ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఇంకా అయిపోలేదు!

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీయంల్లో జరుగుతున్న పండుగ ఆఫర్లు ముగిసిపోయాయి. మరి దీంతో ఆఫర్లన్నీ అయిపోయినట్లేనా? ఇంకే ఆఫర్లూ లేవా? అనుకుంటున్నారా? అయితే ఇక మీరు బాధ పడాల్సిన అవసరం లేనట్లే! ఒప్పో కొన్ని ఎంపిక చేసిన ఫోన్లపై అక్టోబర్ చివరి వరకు ఆఫర్ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఒప్పో రెనో 2 సిరీస్ ఫోన్లను ఆఫ్ లైన్ స్టోర్లలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి, రుణాల ద్వారా కొనుగోలు చేసే వారికి పది ...

Read More »

నేటి నుంచి ప్రారంభం కానున్న Samsung గెలాక్సీ ఏ70ఎస్ అమ్మకాలు

Samsung Galaxy A70s is all set to go on sale in India today.

శాంసంగ్ నుంచి కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఫోన్ కి సంబంధించిన అమ్మకాలు నేడు(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ శుక్రవారం లాంచ్ అయింది. ఈ సంవత్సరమే విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ70కి తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను శాంసంగ్ తీసుకువచ్చింది.ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఇందులోనే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ...

Read More »

టాయిలెట్లో ఫోన్ వాడితే పైల్స్ వచ్చే ప్రమాదం

Using your phone on the toilet is giving you piles

ఈమధ్య కాలంలో వాట్సప్‌లో ఓ జోక్ సర్క్యులేట్ అవుతోంది. గుడి, ఇల్లు, బాత్‌‌రూమ్… చివరకు స్మశానం ఎక్కడైనా ఉపయోగించగల ఏకైక వస్తువు స్మార్ట్‌‌ఫోన్ అనే జోక్ బాగా పాపులర్ అయింది. చివరకు టాయిలెట్‌లో కూడా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవాళ్లున్నారు. అలాంటివారికోసమే ఈ షాకింగ్ న్యూస్. మీకు టాయిలెట్‌లో కూర్చొని స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా? అయితే వెంటనే ఆ అలవాటు మానెయ్యాలి. లేకపోతే రోగాలపాలు అవ్వాల్సిందే. బ్రిటన్‌లో ఓ అధ్యయనం చేస్తే తాము టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నట్టు 57 శాతం మంది ఒప్పుకోవడం షాకిచ్చింది. టాయిలెట్‌లో ...

Read More »

వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి షేర్ చెయ్యవచ్చు

 మీరు గమనిస్తున్నారో లేదో… ఈమధ్య వాట్సాప్‌లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఫీచర్ అందరికీ నచ్చేస్తోంది. ఏంటంటే… ఇప్పటివరకూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టే అప్‌డేట్స్‌ని ఫ్రెండ్స్ చూడగలిగేవారు, కామెంట్స్ చేసేవారు. అలాగే యూజర్లు కూడా తమ స్టేటస్‌ను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలపగలిగేవారు. ఇకపై వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి డైరెక్టుగా షేర్ చెయ్యవచ్చు. తద్వారా… వాట్సాప్‌లో టచ్‌లో లేని ఫ్రెండ్స్… ఫేస్‌బుక్ ద్వారా మన అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు అందరూ వాడుకోవచ్చు. ...

Read More »