Technology

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంలేదు. ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌ లను నిర్ణయించారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా అధికారులు ప్రకటించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్‌ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో ...

Read More »

ఎపిలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 23 నుంచి 25 వరకు మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 2,72,900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ ధరించిన విద్యార్థలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ...

Read More »

ఇసెట్‌కు 85.84 శాతం హాజరు

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఇసెట్‌)కు 85.84 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 36,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 31,891 మంది విద్యార్థులు సోమవారం పరీక్ష రాసినట్లు ఎపి ఉన్నత విద్యామండలి సెట్ల కన్వీనరు ఎం.సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 72 పరీక్షా కేంద్రాలను, హైదరాబాద్‌లో 3 కేంద్రాలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, బిఎస్‌సి మేథమెటిక్స్‌ సిరామిక్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సిఎస్‌ఇ, ఇఇఇ ...

Read More »

తెలంగాణలో కొనసాగుతున్న ఎంసెట్

 తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో తొలిరోజు ఒక్క సెంటర్‌లోనే పరీక్ష జరగనుందని, రేపటి నుండి ఎనిమిది సెంటర్‌లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,43,165 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణలో 79, ఎపిలో 23 చొప్పున మొత్తం 20 టెస్ట్‌ జోన్‌లలో 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,10,11,14 తేదీలలో ప్రతి రోజు రెండు విడతల చొప్పున మొత్తం ఎనిమిది విడతల్లో ఈ పరీక్ష ...

Read More »

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణ హోంమంత్రికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ రాజకీయ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ కోవిడ్‌ బారిన పడగా, తాజాగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కూడా ఈ జాబితాలో చేరారు. హోంమంత్రికి కరోనా టెస్టులు చేయగా వైరస్‌ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న మంత్రి మూడు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయనను ...

Read More »

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ...

Read More »

నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానున్నాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యేట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

Read More »

ఏపీ లో జులై 10 నుండి పదవ తరగతి పరీక్షలు

ఏపీ లో పది పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 10 నుండి 15 వరకు పరీక్షలు నిర్వహించనుంది. జులై 10న మొదటి లాంగ్వేజ్‌, 11న సెకండ్‌ లాంగ్వేజ్‌, 12 ఇంగ్లీష్‌, 13న మ్యాథ్స్‌, 14న జనరల్‌ సైన్స్‌ 15న సోషల్‌ స్టడీస్‌ పేపర్లను నిర్వహించనుంది. కరోనా దృష్ట్యా 11 పేపర్లు జరగాల్సిన పరీక్షలను ఆరుపేపర్లకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీపేపర్‌కు వందమార్కులు ఉంటాయని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించింది.

Read More »

ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

ఎర్రబెల్లి దయాకర్ రావు పై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

నంబర్‌–1 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఇంటర్నల్‌ సర్వేల్లో వచ్చిన రిపోర్టులు తేల్చిన సత్యమిది… పని చేస్తుంటే ప్రశంసలు అవే వస్తుంటాయి.. ఆయన పని తీరు బాగుంది.. ఆ శాఖ ఉద్యోగులతోనూ మంచిగా పనిచేయించడం ద్వారానే ఇది సాధ్యమైంది.. అందుకే మంత్రి దయాకర్‌రావు, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నా..’ అని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో శుక్రవారం ప్రశంసల వర్షం కురింపించారు.అసెంబ్లీలో పల్లె ప్రగతిపై శుక్రవారం జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ మధ్య చేసిన తమ ఇంటర్నల్‌ సర్వే టాప్‌ ఫర్‌ఫార్మర్‌గా ...

Read More »

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఇకపై రీఛార్జ్‌లు కూడా..!

గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదని మనకు తెలిసిన విషయమే. ఏదైనా మనకు అనుమానం వస్తే వెంటనే గూగుల్‌ తల్లి ఉంది కదా అంటూ వెంటనే మొబైల్‌ను వాడుతున్న యూజర‍్లకు గూగుల్‌ ఇప్పుడు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్‌ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్‌ సెర్చ్‌లో ...

Read More »