Telangana

ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్

ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల్లోగా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అవకాశం కల్పించారు. మొత్తం 120 మున్సిపాల్టీలతో పాటు 9 కార్పొరేషన్‌ లో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌ 67.45 శాతం నమోదైంది. ఓట్లు లెక్కింపు ఈ శనివారం జరగనుంది.

Read More »

ప్రారంభమైన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

ప్రారంభమైన తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా బ్యాలెట్‌ పద్దతిలో ఓటింగ్‌ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి తెలిపారు.

Read More »

కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత..యశోదా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్

యశోదా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్

నిన్న జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ, హైదరాబాద్, సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్, వైద్య పరీక్షల అనంతరం అన్నీ సాధారణంగానే వున్నాయని తేలడంతో, తిరిగి ప్రగతి భవన్ చేరుకున్నారు. నిన్న రాత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారన్న వార్త బయటకు రావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాయి. అయితే, యశోదా ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం, కేసీఆర్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, సీటీ స్కాన్, 2డీ ఎకో తదితర అన్ని పరీక్షలూ నిర్వహించారు. మంగళవారం ...

Read More »

కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఎర్రబెల్లి

కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఎర్రబెల్లి

తెలంగాణకు వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని గ్రామీణ, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌ రావు అన్నారు. తెలంగాణలో తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాశేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి, చెరువుల్లోనీళ్లునింపిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వర్ధన్నపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో పలెల్లో పచ్చదనం నింపిన ప్రభుత్వం పల్లెలను కూడా ఎంతో అభివృద్ది చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని ఈసందర్భంగా ఎర్రబెల్లి ...

Read More »

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి

కేసీఆర్‌ పుట్టిన తర్వాతే మోసం పుట్టిందని, ఇలాంటి మోసపూరిత ముఖ్యమంత్రిని ఉరితీసినా తప్పు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆదిభట్ల మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే డబ్బా ఇళ్లు అని విమర్శించిన కేసీఆర్‌.. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామని చెప్పి మాటతప్పారని విమర్శించారు.

Read More »

కేటీఆర్ అట్టర్ ప్లాఫ్ మంత్రి -ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేటీఆర్ అట్టర్ ప్లాఫ్ మంత్రి -ఉత్తమ్ కుమార్ రెడ్డి

సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ మూల సిద్ధాంతానికే ఈ చట్టం వ్యతిరేకం అని పేర్కొన్నారు. కేరళ, పంజాబ్‌ రాష్ట్రాలు శాసనసభ ద్వారా సీఏఏను వ్యతిరేకిస్తునట్లు తీర్మానించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక తీర్మానం చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ద్వంద విధానాలను మైనార్టీలు గమనించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్‌ ప్రతి అంశంలోనూ సహకరిస్తున్నారని ఆరోపించారు.మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మైనార్టీలు ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ అట్టర్‌ ...

Read More »

కేసీఆర్ పై మండిపడ్డ రాజా సింగ్

కేసీఆర్ పై మండిపడ్డ రాజా సింగ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి మత్తు తెలంగాణ, అప్పుల తెలంగాణగా తయారు చేశారని ఎమ్మెల్యే రాజా సింగ్‌ విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్‌లో శనివారం నిర్వహించిన రోడ్‌ షోలో రాజాసింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఒక అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇస్తామన్నా సీఎం ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. అయినా కేసీఆర్‌కు భయపడడానికి తమది కాంగ్రెస్‌ పార్టీ కాదని హెచ్చరించారు

Read More »

జగ్గారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

జగ్గారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జగ్గారెడ్డి మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి బైపాస్ రోడ్డు దగ్గర మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేతిలో ఏమీ లేదని, ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. దున్నపోతుకు గడ్డి వేస్తే బర్రె పాలు ఇస్తుందా? అని వ్యాఖ్యానించారు. ...

Read More »

ఈనెల 20 న మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన

ఈనెల 20 న మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన

మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. దావోస్‌లో నిర్వహించే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గనేందుకు మంత్రి కేటీఆర్‌ ఈనెల 20 న స్విట్జర్లాండ్‌ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు.

Read More »