Spirituality

షిరిడీ సాయిబాబా ఆలయం నిరవధికంగా మూసివేత!

షిరిడీ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. సాయిబాబా ఆలయం నిరవధికంగా మూసివేత!

షిరిడీ ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించడం.. ఆ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.. దీని కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. సీఎం ఉద్ధవ్‌ థాక్రే నిర్ణయంపై షిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం షిరిడీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని కుట్ర చేస్తోందని ...

Read More »

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉన్నట్లే..!

మన పురాణాల ప్రకారం లక్ష్మి పూజ చేసి లక్ష్మి దేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మి స్వరూపం అయిన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయటం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. తెల్లని వస్త్రం పరచి దానిపై ధాన్యము పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది. అలాగే గులాబీ,తామర పువ్వు,మల్లెలు,సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది.అమ్మవారికి ఇష్టమైన తెలుగు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి.లక్ష్మి దేవిని పైన చెప్పిన ఏ ...

Read More »

ఈ నెల 12 నుండి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..!

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవస్థానంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో పలు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Read More »

వైకుంఠ ఏకాదశి ఉపవాస దీక్ష విశిష్టత…!

ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున 33 కోట్ల దేవతల్ని వెంటబెట్టుకొని శ్రీమహావుష్ణుమూర్తి భూమికి వస్తారని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పుణ్యదినాన భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. ఇష్టదైవంపైనే మనసు లగ్నం చేసి దీక్ష పాటిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు. ఈ అవకాశం కల్పిస్తూ తిరుమలలో ఈనెల 6న (సోమవారం) ఉదయం ధనుర్మాస కైంకర్యాల తర్వాత ...

Read More »

ఎవరీ శివుడు? మనిషా లేక దైవమా..?

ఎవరీ శివుడు : మనిషా, కల్పనా లేక దైవమా? శివుడు ఎవరు? భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ వ్యక్తి చుట్టూ ఎన్నో కధలు, పురాణాలూ ఉన్నాయి. ఆయన దేవుడా? లేక భారతీయ సంస్కృతి చేసిన సంయుక్త కల్పనా? లేక దాన్ని అన్వేసిస్తున్న వారికి మాత్రమే అర్థం అయ్యేలా ‘శివ’ అనేదానికి ఇంకా లోతైన అర్థం ఏదైనా ఉందా? సద్గురు “శివ” అన్నప్పుడు మనం రెండు ప్రాధమికమైన అంశాల గురించి మాట్లాడుతున్నాము. “శివ” అనే పదానికి భాషా పరంగా “ఏది లేదో అది” ...

Read More »

పుష్కరిణి..పుష్పవనం..!

ఆలయంలో లేక దాని సమీపంలో ఈశాన్యభాగంలో పుష్కరిణి ఉండటం మనం చాలా ఆలయాల్లో చూడొచ్చు. అలాగే కొన్ని ఆలయాల్లో గుండం, నీటిచెలమ, బావి మొదలైనవాటిని కూడా చూసి ఉంటాం. వీటిని పవిత్రమైన తీర్థాలు అంటారు. కొలను,కోనేరు,కల్యాణి, తటాకం,తీర్థం ఇవన్నీ పుష్కరిణికి ఉన్న అనేక పేర్లు. ఆలయానికి సమీపంలో ఉన్న నీరు పరమపవిత్ర తీర్థమే. ఆ తీర్థాన్ని శివగంగగా భావించి అందులో స్నానం చేసి నన్ను (శివుని) పూజించాలి.‘ అని శివుడు కుమారస్వామికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పుష్కరిణి సాధారణంగా నలుచదరంగా ఉండి అన్నివైపులా దిగడానికి ...

Read More »

సూర్య గ్రహణ సమయంలో ”నవగ్రహ స్తోత్రం” పారాయణం చేస్తే మంచిదంట..!

కేతుగ్రస్త సూర్యగ్రహణం డిసెంబరు 26 మార్గశిర, బహుళ అమావాస్య గురువారం ధనురాశిలో మూలానక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి ధనురాశి వారు శాంతి చేయించుకోవాలని, ప్రత్యక్షంగా వీక్షించరాదని జ్యోతిషులు చెబుతున్నారు. గ్రహణ స్పర్శ కాలం ఉదయం 8.11 నిమిషాలకు, గ్రహణ మధ్యకాలం ఉదయం 9.38 నిమిషాలకు, గ్రహణ మోక్ష కాలం 11.20 నిమిషాలు. గ్రహణానికి ముందు, విడిచిన తర్వాత స్నానం చేసి ఇంటి వద్దే ఉండి జపం చేయడం ఉత్తమమని అంటున్నారు. గర్భిణీలు బయటకి రావడం, గ్రహణ వీక్షణ చేయడం మంచిదికాదని చెబుతున్నారు. ధనురాశి వారు గ్రహణ ...

Read More »

మాతా శారదాదేవి జీవన విధానం..!

ప్రాచీన ఆదర్శాలు–ఆధునిక జీవన విధానాలను సమన్వయం చేసుకున్న సరస్వతి ఆమె. ఒకవైపు ఇంటి వ్యవహారాలు చూస్తూ, కుటుంబంలోని ఒడిదుడుకులనే తపస్సుగా స్వీకరించిన సాధారణ గృహిణి ఆమె. బడికి వెళ్ళి పాఠాలు నేర్వలేదు. పుస్తకాలు చదవలేదు. కానీ ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మిక జ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆవిడే శారదాదేవి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. వీరిద్దరిది భౌతికమైన సంబంధం లేని అన్యోన్య దాంపత్యం. తామరాకుపై నీటిబొట్టులా సంసారంలో ఉంటూనే దాని ప్రభావం తమ మీద పడకుండా చూసుకున్నారు వీరిరువురూ. రామకృష్ణులను తన ఆధ్యాత్మిక పురోగతికి ...

Read More »

ధనుర్మాసం విష్ణుప్రీతికరం.. ఈ వ్రతంతో అవివాహితుల కోరికలు ఫలిస్తాయి!

దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణనానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేని కోసం ప్రార్థించడమనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. మార్గశిర పౌర్ణమి తర్వాత ...

Read More »

ధనుర్మాసంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

రవి ధనుస్సు రాశిలో ప్రవేశించే మాసం ధనుర్మాసం. ఈ మాసం శుభకార్యాలు కొన్నింకి నిషిద్ధం కాని దైవారాధనకు అనువైన మాసం. ఈధనుర్మాసంలో వైష్ణవాలయాలలో జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఆండాల్‌ దేవి అనే ఆవిడ 30 పాశురాలు రచించి పాడింది. వీిని తమిళంలో పాశురాలు అంటారు. 30రోజులు భగవదారాధన చేసి అందులో విలీనమై చివరికి సంక్రాంతి ముందు భోగిరోజున విష్ణువునే వివాహం చేసుకుంది. దానికి సంబంధించిన చిన్న పురాణ కథ.విష్ణుచిత్తుని కూతురు రోజూ మూలమాల క్టి ఆ మాలను తాను ధరించి అద్దంలో ...

Read More »