forbes india rich list 2019
forbes india rich list 2019

ఫోర్బ్స్ జాబితా: దేశంలోనే సంపన్నులు వీరే

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రస్తుతానికి దేశంలోనే అత్యంత ధనవంతుడైన కుబేరుడిగా ఉన్నారు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ’ విడుదల చేసిన భారతీయ సంపన్నుల జాబితాలో వరుసగా 12వ సారి ముఖేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఆయన నికర ఆస్తుల విలువ 51.4 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ తెలిపింది. జియో టెలికాం ద్వారా ముఖేష్ తన ఆస్తులను ఏకంగా 4.1 బిలియన్ డాలర్లు పెంచుకోవడం గమనార్హం.ఇక ముఖేష్ అంబానీ తర్వాత రెండో స్థానంలో పారిశ్రామికవేత్త గౌతం అదానీ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 15.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే అదానీ ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకారు.

అంబానీ – అదానీల తర్వాత మూడో స్థానంలో అశోక్ లేలాండ్ అధినేతలు మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా హిందుజా సోదరులు – షాపూర్ జీ పల్లోన్ జీ గ్రూపు – కోటక్ మహేంద్ర బ్యాంకు అధినేత ఉదయ్ కోటక్ –  హెచ్.సీ.ఎల్ టెక్నాలజీ శివ్ నాడార్ లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఆర్థిక మాంద్యం కారణంగా  దేశంలో గత సంవత్సరం మెరుగ్గా ఉన్న వారంతా ఈసారి ర్యాంకులు దిగజారిపోయారు. గత సంవత్సరం రెండో స్థానంలో కొనసాగిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ఈసారి 17వ స్థానానికి పడిపోవడం విశేషం

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*