Mana Aksharam
  • Home
  • News
  • Editorial
  • మండు టేండలో రాజకీయ మంటలు !!
Editorial News Telangana

మండు టేండలో రాజకీయ మంటలు !!

మండు టేండలో ఇప్పుడు ఖమ్మం మిర్చి ఘాటు హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన ఖమ్మం మిర్చి యార్డ్ దగ్ధం కేసు రోజుకో మలుపు తీరుగుతుంది.వ్యాపారులు,అధికారులు ,పాలకవర్గం కుమ్ముకై మిర్చి ధరను భారీగా తగ్గించడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయిన రైతులు మార్కేట్ పై దాడి చేసి నిప్పు పెట్టారని ప్రతిపక్షాలు చెబుతుంటే అధికార పార్టికి చెందిన మంత్రులు మాత్రం టిడిపి,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుండాలుగా మారి దగ్ధకాండకు పాల్పడ్డారని ప్రత్యారోపణలు చేశారు.కాని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పది మంది రైతుల్లో ఐదుగురు అధికార పార్టికి చెందిన రైతులు ఉండటంతో అధికార పార్టీకి చెందిన అమాత్యులు నోళ్ళు మూతపడ్డాయి.

ఖమ్మం వ్యవసాయ మార్కేట్ యార్డ్ దగ్ధం సంఘనటనలో పోలీసులు మీడియా వద్ద లభించిన విడియో క్లిప్పింగ్ ఆధారంగా 11 మంది రైతులపై కేసులు నమోదు చేసి వీరిలో పదిమంది రైతులను అరెస్ట్ చేసి జైల్ కు పంపించారు.ఈ ఘటనలో సత్తుపల్లి ఎం ఎల్ ఏ సండ్ర వెంకటవీరయ్యను ఏ టూ గా చూపించారు.మిగిలిన పది మంది రైతులపై దేశ ద్రోహం,లూఠీ వంటి సెక్షన్లను నమోదు చేశారు.కాంగ్రెస్,టిడిపి ముసుగులో సంఘ వ్యతిరేక శక్తులే ఈ దాడికి పాల్పడ్డారని మార్కేటింగ్ శాఖ మంత్రి హరిశ్ రావు, ఐటి శాఖ మంత్రి కెటి ఆర్, జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లు ఆరోపించారు. ధర్నాకు వచ్చిన ఎం ఎల్ ఏ సండ్ర వెంకటవీరయ్య రైతులను రెచ్చగొట్టారని ఆరోపించారు.ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ రాష్ర్ర్ట ప్రభుత్వానికి నివేధిక ఇచ్చారు.అందులో కూడా ఎం ఎల్ ఏ సండ్ర రైతులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు.అయితే అరెస్ట్ చేసిన పది మంది రైతుల్లో ఐదుగురు టి ఆర్ ఎస్ కు పార్టీకి చెందిన రైతులు ఉన్నట్లు ఎం ఎల్ ఏ సండ్ర వెంకటవీరయ్య సాక్షాదారాలతో నిరూపించడంతో  అధికార పార్టీ నాయకులు ఇరకాటంలో పడ్డారు.  అరెస్ట్ అయిజైల్ కు వెళ్ళిన రైతుల్లో కల్లూరు మండలం లక్ష్మిపురం గ్రామానికిచెందిన ఇస్లావత్ భాల్యా ఒక్కరు ఇతను  టి ఆర్ ఎస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్త,ఇతని భార్య ఇస్లావత్ లక్ష్మి కూడా గ్రామ టి ఆర్ ఎస్ మహిళా విభాగం అధ్యక్షు రాలు.అదేవిధంగా కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన తేజవాత్ భావ్ సింగ్  కూడా టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త ఇతనికి కూడా పార్టీ సభ్యత్వం ఉంది.అంతేగాకుండా తిరుమలాయపాలేం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన బానోతు సైదులు, మహాబూబ్ బాద్ జిల్లా కురవి మండలం సూదినేపల్లి గ్రామానికి చెందిన భూక్య నర్సింహ్మరావు కూడా టి ఆర్ ఎస్ సభ్యుడే.అరెస్ట్ అయిన పది మంది రైతుల్లో ఐదుగురు టి ఆర్ ఎస్ కార్యకర్తలు అయితే మంత్రులు మాత్రం టిడిపి,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆరోపణలు చేయడం గమనర్హం.

ఖమ్మం మిర్చి ఘాటు నేతల నాశానాలకు తాక్కింది. ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటూ వీధికి ఎక్కుతున్నారు. రైతుల పరమార్శ పేరుతో రాజకీయపక్షాలన్ని ఖమ్మం బాట పట్టాయి. అన్ని పార్టీల ముఖ్య నాయకులు,రాష్ట్ర స్ధాయి నాయకులు ఖమ్మం జిల్లా కు  క్యూ కట్టారు.దీంతో ప్రతి రోజు ఖమ్మంలో మిర్చి రాజకీయ హడాహుడి నెలకొంది.ఇప్పటికే సి ఎల్ పి నేత జానారెడ్డి బ్రందం తోపాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి,సిపిఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జిల్లాను సందర్శించారు. టిడిపి అధ్యక్షులు ఎల్ వి రమణ,వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి నామ నాగేశ్వర్ రావు బ్రందం జిల్లాలో పర్యటించి జైల్ కు వెళ్ళిన మిర్చి రైతుల కుటుంబాలను పరామర్శించారు.రైతులకు మద్దతుగా ఈనెల 13న పాలేరు నియోజకవర్గంలో టిడిపి భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది.రైతులపై తుమ్మల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన సెగ్మెంట్లో ఈ సభ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అఖిలపక్షం ఆధ్వర్యంలో నగర దిగ్బంధనం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. గిట్టు బాటు ధర పక్కన పడిపోయి ఇప్పుడు రైతుల పరామర్శ పేరుతో ఖమ్మం సబ్ జైల్ ను సందర్శిస్తున్నారు.

Related posts

వైసీపీలోకి మాజీ మంత్రి ?

ashok p

ఆమ్రపాలి పెళ్లి శుభలేఖలో అచ్చుతప్పు!

Manaaksharam

రేవంత్ ఇలాకాలో హరీష్ రావు పాగా!

ashok p

Leave a Comment