man dies of egg challenge
man dies of egg challenge

ప్రాణం తీసిన ‘ ఎగ్ ఛాలెంజ్’

గుడ్డు ఆరోగ్యానికి మంచిదే. కానీ, దానితో ఆటలాడితేనే అత్యంత ప్రమాదం. ఇందుకు ఈ ఘటన విషాద ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బజారుకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గుడ్లు తినే విషయం మీద వా గ్వాదం జరిగింది. దీంతో ఎవరు ఎన్ని గుడ్లు తింటారో తేల్చుకుందామని పందెం కట్టారు.

ఆగకుండా 50 గుడ్లు తింటే రూ.2 వేలు ఇస్తానని స్నేహితుడు సవాల్ విసిరాడు. దీంతో సుభాష్.. గుడ్లు తినడం ప్రారంభించాడు. అలా 41 గుడ్లను మింగేశాడు. 42వ గుడ్డు మింగుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఎంతకీ కదలిక లేకపోవడంతో హుటాహుటిన సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. గంట తర్వాత ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. గుడ్లు అతిగా తినడం వల్లే సుభాష్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*