mro vijayareddy murder
mro vijayareddy murder

విజయ రెడ్డిని ఎందుకు చంపాడో చెప్పిన నిందితుడు

రంగారెడ్డి జిల్లా అబ్దు్లాపూర్ మెట్‌లో ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య కలకలం రేపింది. కార్యాయలంలోనే ఆమె హత్యకు గురయ్యారు. సురేష్ అనే రైతు ఆఫీసులోకి చొరబడి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటల్లో చిక్కుకొని విజయారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం సురేష్ తన ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అయితే పోలీసుల విచారణలో తాను ఎందుకు విజయారెడ్డిని హత్య చేశాడో వివరించాడు.

తన భూమికి పట్టా ఇవ్వకుండా ఎమ్మార్వో విజయారెడ్డి తిప్పుతున్నారన్న కోపంతోనే.. ఆమెపై దాడి చేసి హత్య చేశానని సురేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన భూమికి పట్టా కోసం చాలాకాలంగా తహసీల్దారు విజయారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నానని, కానీ పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించారని సురేశ్ తన స్టేట్ మెంట్ లో స్పష్టం చేశాడు. ప్రస్తుతం సురేష్ హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడ్ని విచారించిన పోలీసులు.. హత్యకు దారితీసిన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మేజిస్ట్రేట్ ను తీసుకుని వెళ్లి, సురేశ్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*