naralokesh open letter to tammineni sitaram
naralokesh open letter to tammineni sitaram

తమ్మినేని సీతారాం కు లోకేష్ బహిరంగ లేఖ

.తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు అసభ్య పద జలాలు ఎక్కువయ్యాయి.అటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాలు విలువలు మరిచి ఒకరినొకరు తమ స్థాయి మర్చి పోయే మరి ధూషించుకుంటున్నారు.దీనికి ఈ పార్టీ అతీతం లాగా కనిపించటం లేదు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు పైన అసభ్య పదజాలం ఉపయోగించారు.హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అని తమ్మినేని ప్రశ్నించారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు
తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా బహిరంగ లేఖ రాశారు. ‘మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆక‌ట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఎనిమిదిసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసి విజ‌న‌రీ లీడ‌ర్‌గా ఉన్న చంద్ర‌బాబు గురించి ‘గుడ్డలూడ‌దీయిస్తా’ అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని చిన్న‌బుచ్చేలా ఉన్నాయి.’ అని నారా లోకేష్ లేఖలో ఆరోపించారు.

ఇవన్నీ చూస్తున్న జనాలు మాత్రం ఎవరు తక్కువ కాదు అంటున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*