OnePlus 7T Pro వచ్చేస్తోంది

OnePlus 7T Pro వచ్చేస్తోంది! ఎప్పుడు? ధర ఎంత? స్పెసిఫికేషన్లేంటి?

వన్ ప్లస్ సిరీస్ లో తాజాగా వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 7టీ. ఈ సంవత్సరం మేలో విడుదలైన వన్ ప్లస్ 7కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను విడుదల చేశారు. ఆ లాంచ్ ఈవెంట్ లోనే వన్ ప్లస్ 7టీ ప్రోని కూడా విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చినా దానికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా ఆ ఈవెంట్ లో తెలపలేదు. అయితే అమెజాన్ వెబ్ సైట్ లో అమెజాన్ 7టీ సిరీస్ కు సంబంధించిన పేజ్ ఒకటి ప్రత్యక్షమైంది.

అందులో ఉన్న ఫొటోని బట్టి చూస్తే వన్ ప్లస్ 7టీ ప్రోను వన్ ప్లస్ త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరింకే వివరాలను అక్కడ తెలపలేదు. అయితే అక్టోబర్ 10న ఇంగ్లండ్ లోని లండన్ లో ఈ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. వన్ ప్లస్ 7 ప్రో మాదిరిగానే వన్ ప్లస్ 7టీ ప్రో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ 7టీ ప్రోకి సంబంధించి వార్తలు రావడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఆఫర్ల ద్వారా వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ అధికారిక స్టోర్లు, క్రోమా వంటి భాగస్వామ్య స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చని ఆ బ్యాంక్ ఆఫర్ల పేజీలో కనిపించింది. అంటే ఫోన్ లాంచ్ కానున్న రోజే మనం ఆ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చన్న మాట. అయితే అమెజాన్ లో మాత్రం ఈ ఫోన్ అక్టోబర్ 15 నుంచి అమ్మకానికి రానుందని సమాచారం.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*