Oppo ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఇంకా అయిపోలేదు!

Oppo ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఇంకా అయిపోలేదు!

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీయంల్లో జరుగుతున్న పండుగ ఆఫర్లు ముగిసిపోయాయి. మరి దీంతో ఆఫర్లన్నీ అయిపోయినట్లేనా? ఇంకే ఆఫర్లూ లేవా? అనుకుంటున్నారా? అయితే ఇక మీరు బాధ పడాల్సిన అవసరం లేనట్లే! ఒప్పో కొన్ని ఎంపిక చేసిన ఫోన్లపై అక్టోబర్ చివరి వరకు ఆఫర్ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఒప్పో రెనో 2 సిరీస్ ఫోన్లను ఆఫ్ లైన్ స్టోర్లలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వారికి, రుణాల ద్వారా కొనుగోలు చేసే వారికి పది శాతం క్యాష్ బ్యాక్ ను అందించనుంది. ఒప్పో ఏ సిరీస్ 2020 మొబైల్స్ పై ఈ పద్ధతిన కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభించనుంది.

ఒప్పో ఏ5ఎస్, రెనో, రెనో 10ఎక్స్ జూమ్, ఏ9, కే3 రెనో2 సిరీస్, ఏ సిరీస్ లను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు లభిస్తాయి. రెనో 2 సిరీస్, ఏ 2020, రెనో, రెనో 10ఎక్స్ జూమ్ లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఎక్స్ చేంజ్ పై రూ.7,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఒప్పో కే3, ఏ3ఎస్ లు కొనుగోలు చేసే వారికి రూ.1,000 తగ్గింపు లభించనుండగా, ఒప్పో కే1 కొనుగోలుపై ఏకంగా రూ.4,000 తగ్గించనున్నారు.

ఎక్స్ చేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లే కాకుండా ఎస్ బీఐ కార్డుతో కొనుగోలు చేసేవారికి పది శాతం అదనపు తగ్గింపు లభించనుంది. ఫ్లిప్ కార్ట్ లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*