”అయోధ్య తీర్పు” పై జనసేనాని స్పందన !

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చారిత్రాత్మకమైనదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతోందని కొనియాడారు జనసేనాని. భారతీయులమంతా కోర్టు తీర్పును హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ధర్మాన్ని సమర్థించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సూచించింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*