టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న సల్మాన్ హీరోయిన్..

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే.. ఇండస్ట్రీలో కొనసాగినంతకాలం కాలు బయటపెడితే కారు.. నచ్చిన ఫుడ్డు.. మెచ్చిన బెడ్డు. మేడమ్ అంటూ రాచమర్యాదలు.. అవకాశాలు లేక నటనకు దూరమైతే.. ఆర్థిక పరిస్థితులు సహకరించక అయిన వాళ్లందరూ మొహం చాటేస్తే పరిస్థితులు దుర్భరంగా మారతాయి. ఇప్పటి హీరోయిన్లంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఒకప్పటి హీరోయిన్లు అలాకాదు. ఎంత సంపాదించినా అంతా ఖర్చుపెట్టడమో.. దాన ధర్మాల పేరుతో కొంత ఖర్చుచేయడమో.. ఆయిన వారందరి అవసరాలు తామే చూడవలసి రావడమో జరుగుతుండేది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ నేడు డబ్బుల్లేని దీనస్థితిలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. దాదాపు 24 ఏళ్ల క్రితం వచ్చిన వీర్‌ఘటి సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించిన పూజా డడ్వాల్ పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక టిఫిన్ సెంటర్ నడుపుతోంది. కొన్ని నెలల క్రితం క్షయవ్యాధితో బాధపడుతూ డబ్బుల్లేని పరిస్థితిలో ఉంటే సల్మాన్ ఆమె చికిత్స కోసం ఆర్థికంగా సాయం అందించారు. కోలుకున్నాక సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామన్న ఒక్కరూ అడ్రస్ లేరు. ఓ స్నేహితుడి సలహా మేరకు టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని చెబుతోంది పూజ.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*