Redmi 8 వచ్చేసింది..ఆఫర్ కూడా అదుర్స్!

Redmi 8 వచ్చేసింది..ఆఫర్ కూడా అదుర్స్!

భారత స్మార్ట్ ఫోన్ రంగంలో నంబర్ వన్ అయిన షావోమి మార్కెట్లోకి మరో బడ్జెట్ మొబైల్ ను తీసుకువచ్చేసింది. ఈ సంవత్సరం మార్చిలో ఆ సంస్థ విడుదల చేసిన రెడ్ మీ 7కు తర్వాతి వెర్షన్ అయిన రెడ్ మీ 8 నేడు(అక్టోబర్ 9) భారత మార్కెట్లోకి వచ్చేసింది. మరి దీని ఫీచర్లేంటి? ధర ఎంత? ఈ ఫోన్ తో ఇచ్చిన ప్రత్యేక ఆఫర్లేంటి అని తెలుసుకుందామా మరి!

రెడ్ మీ 8 మొబైల్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గానూ, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,999గానూ నిర్ణయించారు. ఈ ఫోన్ ఓఎన్ వైఎక్స్ బ్లాక్, రూబీ రెడ్, సాఫైర్ బ్లూ రంగుల్లో మార్కెట్లోకి రానుంది.

అయితే షావోమి తాజాగా 100 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల విక్రయించిన మార్కును చేరుకోవడం, భారత మార్కెట్లో వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో కూడా షావోమినే నంబర్ వన్ గా నిలవడంతో ఎంఐ అభిమానుల కోసం రెడ్ మీ 8 స్మార్ట్ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ లో మొదటిగా అమ్ముడయ్యే 50 లక్షల మొబైళ్లను రూ.7,999కే విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన మొదటి సేల్ అక్టోబర్ 12న అర్థరాత్రి 12:01 నిమిషాలకు ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోంలో జరగనుంది.


336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*