Mana Aksharam
  • Home
  • Entertainment
  • RRR సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే డైసీ ఎడ్గార్ జోన్స్ ఎవరు?
Entertainment

RRR సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే డైసీ ఎడ్గార్ జోన్స్ ఎవరు?

daisy edgar jone

ఎట్టకేలకు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఊహాగానాలకు అన్నింటికి ఒకేసారి చెక్ పెట్టేశాడు. హీరోయిన్స్ కూడా రివీల్ చేసేసాడు. హీరొయిన్లు ఎవరు అన్న విషయం రాజమౌళి స్వయంగా ప్రకటించేశారు. చరణ్ సరసన అలియా భట్ తారక్ సరసన డైజీ ఎడ్గార్ జోన్స్ నటిస్తారని క్లారిటీ ఇచ్చేసారు. ఓసారి ఎయిర్ పోర్ట్ లో అలియా భట్ ని కలుసుకున్నప్పుడు దీని గురించి మాట్లాడడం జరిగిందని ఇందులో సీత పాత్ర పట్ల తను చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సో ఫైనల్ గా తననే సెలెక్ట్ చేసుకున్నట్టు ధ్రువీకరించారు.
ఇక డైజీ గురించి డైనమిక్ లేడీ అని చెప్పిన రాజమౌళి తన పాత్ర గురించిన పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి అతి కీలకమైన అప్ డేట్ ఇదే. గత రెండు మూడు రోజులుగా అలియా భట్ నో చెప్పిందని రాజమౌళి సినిమా అయినా తాను డబ్బు కోసం ఒప్పుకోనని చెప్పిందని రకరకాలుగా మీడియా ప్రచారం జరిగింది.దానికి తోడు రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ లో భాగంగా ఉన్న అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ కు బల్క్ డేట్స్ ఇవ్వడం గురించి పలు కథనాలు కూడా వచ్చాయి.
అయితే రాజమౌళి ఇచ్చిన పాత్ర చిన్నదో లేక తక్కువ కాల్ షీట్స్ లో పూర్తయ్యేలా ప్లాన్ చేశాడో తెలియదు కాని మొత్తానికి అలియా లైన్ లోకి వచ్చింది. ఇక ఆ డైజీ ఒక బ్రిటిష్ హీరోయిన్ . ఆమె కోల్డ్ ఫీట్ , వార్ అఫ్ వరల్డ్స్ , పోండి లైఫ్ అనే సినిమాలో నటించి మెప్పించింది. చరణ్ తారక్ ఇద్దరితోనూ ఏ సౌత్ హీరొయిన్ నటించడంలేదన్నది పక్కా అయిపోయింది. దీనితో ఇప్పటి వరకు వచ్చిన పుకార్లు కొన్ని నిజాలుగా , మరికొన్ని కల్పితాలుగా మిగిలిపోయాయి.

Related posts

కత్తి మహేశ్‌ అరెస్టు:రాముడిపై అనుచిత వ్యాఖ్యలే కారణం

ashok p

మాదకద్రవ్యాల అలవాటు లేదు నమూనాలు ఇచ్చేందుకు నిరాకరణ

ashok p

పవన్‌కి చెర్రీ బర్త్ డే గిఫ్ట్..

ashok p