rtc jac chalo tankband
rtc jac chalo tankband

ఇవాళ ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తగ్గేలా కనిపించటం లేదు.రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉదృతంగా మారుతుంది. 35 రోజులుగా జరుగుతున్న సమ్మెను ఆపేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్ని్స్తున్నా ఫలితం కనిపించట్లేదు. ఉద్యోగాల్లో తిరిగి చేరమని కార్మికులకు ఎన్ని ఆఫర్లు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా… ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. రోజురోజుకూ సరికొత్త విధంగా తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు. తాజాగా… మిలియన్ మార్చ్ తరహాలో… ఛలో ట్యాంక్ బండ్ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు మద్దతివ్వడంతో… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇలాంటి ఆందోళన ద్వారానే ప్రభుత్వం దిగివస్తుందనీ, డిమాండ్లు నెరవేర్చుకోవడానికే ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్ బండ్ నిర్వహిస్తున్నారనీ… దీనికి పోలీసులు సహకరించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే చాలా మంది నాయకుల్ని అరెస్టు చేసింది. కొంతమందిని నిర్బంధించింది.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*