Mana Aksharam
Cinema Entertainment

సర్కార్ రివ్యూ & రేటింగ్

దర్శకుడు ఏఆర్ మురగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా ప్రేక్షకులను అలరించాయి. ఈ సక్సెస్ జోడి మూడో ప్రయత్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న సర్కార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, విజయ్ స్టార్ స్టామినా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళీ కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ మూటగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఎల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈవోగా సేవలందిస్తుంటారు. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సుందర్ అంటే దడ. ప్రతీ దేశంలోని ప్రత్యర్థి కంపెనీలపై దాడులు చేసే ఛంఘీజ్ ఖాన్ అనే పేరు మూటగట్టుకొంటాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఇండియాకు వస్తుంటే అందరూ గజగజలాడిపోతాడు. కానీ అతడు స్వదేశానికి ఓటు వేయడానికి వచ్చాడని తెలుసుకొని ఊరట చెందుతారు. కానీ ఓటు వేయడానికి వచ్చిన సుందర్‌కు ఓ షాక్ తగులుతుంది. అప్పటికే సుందర్ ఓటు మరోకరు వేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

తన ఓటును మరో వ్యక్తి వేసిన క్రమంలో సుందర్ ఏం చేశాడు? తన ఓటు హక్కును ఎలా సాధించుకోగలిగాడు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సుందర్ ఏం చేశాడు. సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కూతురైన లీలా (కీర్తీ సురేష్‌)కు సుందర్‌కు లింక్ ఏమిటీ? విదేశాల్లో ఉండే కోమలివల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్) రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కోమలివల్లికి సుందర్‌కు మధ్య వైరం ఎందుకు కలిగింది? రాజకీయాల్లో సుందర్ తన లక్ష్యాన్ని ఛేదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సర్కార్ సినిమా కథ.

సర్కార్ సినిమా తొలిభాగంలో విజయ్ స్వదేశాగమనంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను చెప్పే అంశం ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సాగుతుంది. కానీ కథ లోతుల్లోకి వెళ్లిన కొద్ది విషయం లేదనే అంశంతో ప్రేక్షకుడిని నిరాశ అవరించడం మొదలవుతుంది. ఇంటర్వెల్‌కు ముందు రెండు పాటలు, రెండు ఫైట్లు, ఓ ఆసక్తికరమైన పాయింట్ తప్ప ఏమీ కనిపించదు.

ఇక సెకండాఫ్‌లో రాజకీయ వాతావరణం వేడేక్కుతుందని భావించిన ప్రేక్షకుడికి సన్నివేశాల్లో, కథలో ఎలాంటి వినోదం, ఉద్వేగం కనిపించదు. ఇక సెకండాఫ్‌లో 30 నిమిషాల తర్వాత మరీ నాసిరకంగా సన్నివేశాలు పేర్చుకొంటూ పోవడంతో ట్రాక్ తప్పిందనే విషయం బోధపడుతుంది. దానికి తోడు రెహ్మాన్ సంగీతం మరీ పేలవంగా ఉండటంతో ఉండే ఆసక్తి తగ్గిపోతుంది. యువతను, ఓటర్లను చైతన్య పరిచే అంశాన్ని బలంగా చెప్పలేకపోవడం, సినిమా ఫార్మూలాకు అనుగుణంగా కథ నడవడంతో రొటీన్ సినిమాగా మారిపోయిందని చెప్పవచ్చు.

ప్రేక్షకుడిని ఆలోచింప జేసే అంశాలను ఎత్తుకోవడం దర్శకుడు మురుగదాస్ ప్రత్యేకత. కానీ ఇటీవల కాలంలో బలమైన పాయింట్‌ను కథను బలంగా అల్లుకొనే విషయంలో తడబాటుకు లోనవుతున్నారు. కథనం మరీ పేలవంగా కనిపిస్తుంది. సర్కార్ విషయంలోనూ దర్శకుడు ఇదే పొరపాటు చేశాడనే చెప్పాలి. ఏదో చెప్పాలనే కసి కనిపిస్తుంది కానీ.. కథ, కథనాల్లో అది కనిపించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్తే మరోసారి మురగదాస్ నిరాశే మిగిల్చాడని చెప్పవచ్చు.

విజయ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టు అల్లుకొన్న కథ ఇది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు సన్నివేశాలు, తన అభిమాన అనుచరగణం కోసమే తీసిన సినిమాగా అనిపిస్తుంది. ఓటర్లను పక్కన పెడితే అభిమానులనే మెప్పించలేకపోయాడనే చెప్పవచ్చు. పాటలు చాలా నాసిరకంగా ఉండటంతో విజయ్ డ్యాన్సుల్లో పస కనిపించలేదు. నాలుగైదు సీన్లు మాత్రమే ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించే విధంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కెమెరా ముందు అనవసరంగా ఊగిపోవడం విసుగుపుట్టించేలా ఉంటుంది.

బలం, బలహీనత:

ప్లస్ పాయింట్స్

విజయ్ ఫెర్మాన్సెన్స్

ఓ మేరకు ఫస్టాఫ్

వరలక్ష్మీ శరత్ కుమార్

మైనస్ పాయింట్స్

ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్

పాటలు చిత్రీకరణ

ఎడిటింగ్

కథ, కథనాలు

తెలుగు నేటివిటికి దూరంగా

Related posts

మహర్షి ఇంటర్వెల్ సీన్ బ్లాక్బస్టర్ అట..!

Harika

తనీష్ ను సిట్ అడిగిన ప్రశ్నలివే!

ashok p

హీరోయిన్ కటౌట్ కి పాలాభిషేకం..

Harika