Tag Archives: Amaravati

20 నుంచి అసెంబ్లీ..రాజధాని భవిత తేలేది ఆ రోజే!

మళ్ళీ చిరు - పవన్ ల మధ్య వార్ చిచ్చు రేపింది ఎవరో తెలుసా..!

జగన్ సర్కార్ దూకుడు పెంచింది. రాజధాని వ్యవహారాన్ని తేల్చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 20న ఉదయం 9.30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మంత్రివర్గ సమావేశంలోనే రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Read More »

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ప్రతి ఏటా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనే తాను.. ఈసారి మాత్రం దూరంగా ఉన్నాను అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి ఏటా సొంత ఊరికి వెళ్లి వేడుకల్లో పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద భోగి మంటలు వేయగా.. చంద్రబాబు నాయుడు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల్లో జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను తగులబెట్టారు.

Read More »

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి కేసులో నలుగురు అరెస్ట్..!

ఈ నెల 7న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన రాళ్ల దాడి కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కారుపై దాడి చేసిన వారిని గుర్తించారు. తాజాగా వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పిడుగురాళ్లకు చెందిన ఇంతియాజ్‌, వినుకొండకు చెందిన సాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పి.సత్యనారాయణ, మంగళగిరి మండలం చినకాకానికి చెందిన కఠారి ప్రసాద్‌ ఉన్నట్టు గుంటూరు రూరల్ ...

Read More »

చేతులు కట్టుకుని కూర్చోం.. అంబటి రాంబాబు ఘాటు హెచ్చరికలు

చేతులు కట్టుకుని కూర్చోం.. అంబటి రాంబాబు ఘాటు హెచ్చరికలు

ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని అడ్డగించి ఆయన వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదవి కోల్పోవడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. ఈ రోజు పిన్నెల్లిపై జరిగిన దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. గతంలోనూ చంద్రబాబు అలానే చేశారన్న అంబటి.. పదవి కోసం దివంగత ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించారని గుర్తు చేశారు. చంద్రబాబు రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు. తన పదవి కోల్పోతే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గతంలో ...

Read More »

దేవినేని ఉమాని ఈడ్చుకెళ్తున్న పోలీసులు..

దేవినేని ఉమాని ఈడ్చుకెళ్తున్న పోలీసులు

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ రహదారి దిగ్బంధం ఉద్రిక్తంగా మారింది. మంగళవారం గొల్లపూడిలో జాతీయ రహదారిని దేవినేని దిగ్బంధించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దేవినేని, నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 

Read More »

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకు బీసీజీ నివేదిక : ఏపీకి రెండు ఆప్షన్లు

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రెండు ఆప్షన్లు సూచించిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. అసలు సచివాలయానికి ఎవరెవరు ఏయే పనులపై వస్తారు? ఎంత మంది వస్తారన్న దానిపై బీసీజీ ఆసక్తికర విశ్లేషణ చేసిందని తెలిపారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో శుక్రవాయం ఆయన మాట్లాడుతూ ‘ఏడాది మొత్తం లక్షమంది సచివాలయానికి వస్తే అందులో అధిక శాతం కేవలం ముఖ్యమంత్రి సహాయనిధికోసమే గతంలో వచ్చారని బీసీజీ తెలిపింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలామంది ...

Read More »

రోడ్డుపై భైఠాయించిన పవన్ కళ్యాణ్ ..!

అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. మందడం సమీపంలో జనసేనానిని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా పోలీసులు ఆపారు. అక్కడ నుంచి నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌ వెళ్లకుండా తాళ్లతో అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనసైనికులు, స్థానిక రైతులు పోలీసులపై మండిపడ్డారు. జనసైనికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు, కాన్వాయ్‌ దారి ఇవ్వాలని నినాదాలు చేశారు. పోలీసులు రోడ్డుకు అడ్డుగా ...

Read More »

కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక పరిమితులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం..!

కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోదాలు తొలిగినట్లే కనిపిస్తుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారు. పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది. దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి టీడీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. తాజాగా ఒప్పందంలో ...

Read More »

ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష..!

అర్హులైన పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలో ఇళ్ల స్థలాల పంపిణీకై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు.కాగా ఇల్లులేని, అర్హులైన పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ఇళ్లు కట్టిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చిన విషయం విదితమే. అదే విధంగా ఇళ్ల స్థలాలు ...

Read More »

అమరావతిలో టెన్షన్, టెన్షన్.. గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు

అమరావతిలో టెన్షన్, టెన్షన్.. గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు

మూడు రాజధానుల ప్రకటపై అమరావతిలో రైతుల ఆందోళనకు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, యువత, పిల్లలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం తుళ్లూరులో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కోసం రైతులు వేసిన టెంట్లను పోలీసులు తొలగించేశారు. దీంతో పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ధర్నాకు సహకరించాలని పోలీసుల్ని రైతులు కోరారు. అయితే పోలీసులు టెంట్లు వేయొద్దని రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. ఇటు రైతులు మందడం రోడ్డుపే ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ...

Read More »