Tag Archives: ap elections

ఏపీలో కీలక నేతల భార్యల ప్రచారం..

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18 రానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీలు తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మరో స్థాయి యుద్దమే నడుస్తుంది. కాగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కీలక నేతలను గెలిపించుకునేందుకు వారి భార్యలు రంగంలోకి దిగారు. ఎప్పుడు ...

Read More »

ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రలోభాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా డబ్బు, బంగారం, వెండి, మద్యం, చీరలు, గిఫ్టు ఐటెమ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల అధికారులు దూకుడు పెంచారు. తాజాగా ఎన్నికల నిబంధనల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, ...

Read More »

ఏపీ ఎన్నికల పోరు.. బరిలో మాజీ సీఎంల వారసులు..

ఏపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈసారి ఏకంగా మాజీ సీఎంల వారసులు ఎనిమిది మంది బరిలో నిలవనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమారుడు, ...

Read More »

మోగిన ఎన్నికల నగారా… ఏపీలో మే 13న ఎన్నికలు

కేంద్ర ఎన్నికల సంఘం నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు. ఇక ...

Read More »

బిగ్ బ్రేకింగ్..ఆ రోజే ఏపీలో ఎన్నికలు..?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. తాజాగా అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది ఈసీ. ప్రధాన ఎన్నికల అధికారి – ఆంధ్రప్రదేశ్ భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. 12-3-2024 = ఎన్నికల నోటిఫికేషన్28-3-2024 = నామినేషన్ ప్రారంభమవుతుంది.19-4-2024 = పోలింగ్ రోజు22-5-2024 = కౌంటింగ్ (ఫలితం)30-5-2024 = కొత్త ప్రభుత్వం.

Read More »