Tag Archives: ap

తెలంగాణ, ఏపీ ప్రజలకు చల్లటి కబురు

రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి తెలిసిందే. బయట అడుగుపెట్టలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు అలాగే వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు అలాగే రేపు తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇలాంటి నేపథ్యంలో చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నాలుగు జిల్లాలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో 43.4° ఉష్ణోగ్రత నమోదు అయింది. ...

Read More »

నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు

నేడు, రేపు భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అనంతపురం (D)లో 41 నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, NTR జిల్లాల్లో 41-44, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూ.గో జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నిన్న నంద్యాల(D) చాగలమర్రిలో గరిష్ఠంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Read More »

ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రలోభాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా డబ్బు, బంగారం, వెండి, మద్యం, చీరలు, గిఫ్టు ఐటెమ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల అధికారులు దూకుడు పెంచారు. తాజాగా ఎన్నికల నిబంధనల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రామ్ మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా, ...

Read More »

నేడే ఏపీలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఏపీ కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉక్కు తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం భారీగా బ్యానర్లు, కటౌట్లు కట్టింది. సభాస్థలి ప్రాంగణం సమీపంలో కట్టారు. ఉక్కు కర్మాగారంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్ తెలిపారు. ఇవాళ ...

Read More »

AP పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. తెరపైకి బీజేపీ ‘కాపు సీఎం’ నినాదం

ఏపీ పాలిటిక్స్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. క్రమంగా ఆంద్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుకు బీటలు వారుతున్నాయి. బీజేపీ హై కమాండ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. ఏపీలో కాపు నినాదం అందుకోవాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘కాపు సీఎం’పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీసీ సీఎం తరహాలో ఏపీలో కాపు సీఎం నినాదాన్ని బీజేపీ ఎంచుకున్నట్లు సమాచారం. టీడీపీ కమ్మ, వైసీపీ రెడ్డి సీఎంల నేపథ్యంలో కాపులను దగ్గరకు చేర్చుకునే వ్యూహాన్ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరో ...

Read More »

ఏపీలో కాంగ్రెస్ తొలి భారీ బహిరంగ సభ.. హాజరవుతున్న రేవంత్ రెడ్డి!

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. షర్మిల బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఈ నెల 25న జరగబోతున్న ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరవుతున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల ...

Read More »

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-1, 2 పోస్టుల భర్తీ చేపడుతున్న APPSC.. త్వరలోనే 861 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆర్థిక శాఖ అనుమతించడంతో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 పోస్టులకు వారంలో ప్రకటన ఇవ్వనుంది.

Read More »

ఏపీలో పొత్తులపై అమిత్ షా బాంబ్ పేల్చారు..!

ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పొత్తులపై స్పందించారు. ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపలేదని స్పష్టం చేశారు. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే కూటమి నుంచి బయటికి వెళ్లి ఉండొచ్చని అమిత్ షా పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.

Read More »

ఏపీలో జోరుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 30.61 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం సచివాలయాల పరిధిలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 10వేలకుపైగా రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాటు చేశామన్నారు. కన్వెయన్స్ డీడ్స్ ను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరి మూడో వారంలో సీఎం జగన్ ప్రారంభించే అవకాశం ఉంది.

Read More »

ఎపి, తెలంగాణ కొట్టుకుంటే.. కేంద్రం పెత్తనం చేస్తోంది..!

రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా బలమైన కేంద్రం ఉండాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాకు అనుగుణంగానే మంగళవారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉంది. బోర్డుల పరిధి, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు అనుమతులు వంటి విషయాల్లో తుది నిర్ణయం తమదేనని చెప్పడం రాష్ట్రాల హక్కులను హరించడమే. ట్రిబ్యునల్‌ కేటాయిపుల ఆధారంగా రాష్ట్రాలు ప్రాజెక్టులను చేపట్టడం సర్వసాధారణం.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనేది రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారం. ప్రాజెక్టుల నిర్వహణ ...

Read More »