Tag Archives: assembly

అలా చేస్తే కాళేశ్వరం పూర్తిగా కూలిపోతుంది: ఉప ముఖ్యమంత్రి బట్టి

తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ మాదిరిగా సుందిళ్ల, అన్నారం పరిస్థితి ఉండబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని. పగుళ్లకు రిపేర్లు చేస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది. ప్రజెక్టులు ...

Read More »

నేడు అసెంబ్లీకి రానున్న కేసీఆర్ !

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.

Read More »

రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన..!

బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల ...

Read More »

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజు కూడా సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. దీంతో, ఈరోజు ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. టీడీపీ సభ్యులను ...

Read More »

గత ప్రభుత్వానికి… తన ప్రభుత్వానికి తేడా..!

2024 జూన్ లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు సీఎం జగన్. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందులు వేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామన్నారు. అయితే, కరొనా కారణంగా అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. కరొని సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.66,116 కోట్లు నష్టపోయామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా 35శాతం… కానీ ఈ ఐదేళ్లలో కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా మాత్రం 31.5 ...

Read More »

ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. మరోవైపు, టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, ...

Read More »