Tag Archives: Ayodhya dispute

అయోధ్య తీర్పుపై అసదుద్దీన్‌ అసంతృప్తి

ఆయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్‌ మాట్లాడుతూ… బాబ్రీ మసీదు నిర్మాణానికై సున్ని వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారని తెలిపారు. ‘అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలింది. సుప్రీం ...

Read More »

అయోధ్య కేసు:సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

దాదాపు శతాబ్ధంన్నర్రగా వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. 1856 నుంచి హిందూ_ ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది. అదే సమయంలో ముస్లిం మతవిశ్వాసాలకు ప్రాధాన్యతనిస్తూ.. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేస్తూ గతంలో ...

Read More »

అయోధ్య తీర్పు :షియా బోర్డు పిటిషన్ కొట్టేసిన కోర్టు

అయోధ్య కేసులో తుది తీర్పును చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్ చదువుతున్నారు. వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన షియా బోర్డు పిటిషన్ కొట్టివేశింది న్యాయస్థానం. మసీదును బాబర్ నిర్మించాడనేదానిని మేం సమర్థిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే బాబ్రీ మసీదు ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించారో తెలిదన్నారు. ప్రజల విశ్వసాలను, నమ్మకాల్ని గౌరవిస్తున్నామని తెలిపింది. తీర్పు కాపీ చదివేందుకు అరగంట సమయం పట్టనుంది. మత గ్రంధాలను బట్టి కోర్టు తీర్పు ఉండదని తెలిపింది. తీర్పుపై ఐదుగురు జడ్జీల ఏకాభిప్రాయం కుదిరింది.

Read More »

అయోధ్య తీర్పు :తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్‌!

అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీస్‌ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ...

Read More »