Tag Archives: bus yatra

ఈనెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Read More »

కేసీఆర్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తాజాగా ఈ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూప‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న గులాబీ ...

Read More »

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

కాసేపట్లో వేంపల్లెలో షర్మిల బస్సుయాత్ర.. సునీతతో కలిసి రోడ్‌షోలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్సార్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటారు. మరికాసేపట్లో వేంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభిస్తారు. లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సుయాత్ర ...

Read More »

ఇవాల్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా PCC చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, అట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.

Read More »

నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Read More »

రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర

రెండోరోజు నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి రాత్రికి నాగలపురంలోనే బస చేయనున్నారు.

Read More »

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇదే?

రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్‌. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...

Read More »

తల్లి విజయమ్మ ఆశీర్వాధంతో.. జగన్ బస్సుయాత్ర ప్రారంభం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ...

Read More »

మేమంతా సిద్ధం: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ...

Read More »