Tag Archives: cbi

ఇది బీజేపీ కస్టడీ: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని అన్నారు. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సీబీఐ అడుగుతోందన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Read More »

శరత్ చంద్రారెడ్డి ఐదు మద్యం రిటైల్ జోన్లు కవిత ఇప్పించారన్న సీబీఐ

ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణ వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది. ఐదు జోన్లు తనకు ...

Read More »

లిక్కర్ కేసులో కీలక పరిణామం…జైల్లోనే కవితను ప్రశ్నిస్తామన్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని… అందువల్ల తాను కోర్టుకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ...

Read More »

సీబీఐ నోటీసులు.. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కవిత భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈరోజు (26న) ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇంతకు ముందు ఈ కేసులో కవిత కేవలం సాక్షిగా మాత్రమే ఉన్నారు. అయితే, ఆమెను నిందితురాలిగా మారుస్తూ సీబీఐ తాజగా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని లేఖలో కవిత కోరారు. ...

Read More »

సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ ప్రారంభం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను బిహార్‌ పోలీసుల నుంచి గురువారం సీబీఐ స్వీకరించింది. ఎస్పీ నుపుర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో డీఐజీ గగన్‌దీప్‌ గంభీర్, జాయింట్‌ డైరెక్టర్‌ మనోజ్‌ శశిధర్‌ పర్యవేక్షణలో సీబీఐ ఈ కేసును విచారించనుంది. డీఐజీ గగన్‌దీప్, జేడీ మనోజ్‌ గుజరాత్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు. సుశాంత్‌ స్వరాష్ట్రమైన బిహార్‌లో ఇప్పటికే పోలీసులు సుశాంత్‌ తండ్రి ఫిర్యాదుపై ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తిపై నేరపూరిత కుట్ర, ఆత్మహత్యకు పురిగొల్పడం మొదలైన నేరాలకు సంబంధించిన ...

Read More »