Tag Archives: cm jagan

నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉంది: ఏఏజీ పొన్నవోలు సుధాకర్

నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందని ఏఏవో పొన్నవోలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో జగన్ చేర్చించారని ఆమె ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ...

Read More »

జగన్ కోసం జనంలోకి భారతి..

జగన్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న నేపథ్యంలో పులివెందులలో ప్రచార బాధ్యతలు జగన్ సతీమణి వైఎస్ భారతి తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. స్థానిక వైసీపీ నేతలతో కలిసి భారతి ప్రచారం నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. 2014, 2019ఎన్నికల్లో కూడా జగన్ తరఫున భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

Read More »

సీఎం జగన్ ప్రచార షెడ్యూల్

ఈనెల 28 నుంచి సీఎం జగన్ ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే సభల్లో జగన్ ప్రసంగిస్తారు. 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో పాల్గొంటారు.

Read More »

మరో విజయయాత్రకు సిద్ధమవుతున్న వైసీపీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు, మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తోంది. ఈ నెల 27 లేదా 28 తేదీల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు. రానున్న 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కోసభ ఉంటుందని ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గురువారం పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో సీఎం జగన్ పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కమలాపురం లో టీడీపీకి షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ వీర శివారెడ్డి తెలుగుదేశం ...

Read More »

పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సుయాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్. ఓ కు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన ...

Read More »

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: సీఎం జగన్

సీఎం జగన్ ఇవాళ టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సాయంత్రం వేళ అక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించారు. ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అని సమర శంఖం పూరించారు. డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. రేపటి ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి… ...

Read More »

అగ్రవర్ణాలన్నీ జగన్ కే మద్దతు ఇస్తున్నాయి: జోగి రమేశ్

ఎన్నారైలు రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కండకావరంతో టీడీపీకి సపోర్ట్ చేసే ఒక ఎన్నారై రాష్ట్ర ఓటర్లను వెధవలు అన్నాడని మండిపడ్డారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలని… మంచి చేస్తున్న జగన్ వైపే ఎన్నారైలు ఉండాలని చెప్పారు. ఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎంగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని… ...

Read More »

ఆ నియోజకవర్గంలో విజయం మనదే:సీఎం జగన్

మన్యం జిల్లా సాలూరులో విజయం వైసీపీదే అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పాలూరు అభ్యర్థి పీడిక రాజన్న దొర, సాలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు వి. శ్రీనివాస్ రెడ్డితో ఆయన మాట్లాడుతూ, సాలూరులో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, అమలు జరిపిన పథకాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ...

Read More »

పోలీసు కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయిదాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీశ్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించిన కోర్టు.. లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది. నిందితుడు సతీశ్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సతీశ్ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రేపటి నుంచి సతీశ్‌ను విచారించనున్నారు.

Read More »