Tag Archives: congress

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి

బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఈరోజు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వీరిద్దరికీ రేవంత్, దీపాదాస్ మున్షీ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.

Read More »

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్యేల్యే మదన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. శుక్రవారం సీఎం నివాసంలో బీఆర్ఎస్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్య నేతలు… ముఖ్యమంత్రితో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More »

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది : మంత్రి కోమటిరెడ్డి

కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలింది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతాడు. లోక్ సభ ఎన్నికల తరువాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తాం. నల్గొండ, భువనగిరి ఎంపీ ...

Read More »

మరో కీలక పరిణామం.. ఈరోజు రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై శ్రీహరితో రేవంత్ చర్చించారు. వీరిద్దరూ ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరంగల్ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ...

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక జరుగుతోంది. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.

Read More »

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇవాళ కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక జరగనుంది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. ఈ తరుణంలో మహబూబ్నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇక ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ ...

Read More »

ఢిల్లీకి చేరుకున్నCM రేవంత్.. MP టికెట్ ఆశవహుల్లో తీవ్ర ఉత్కంఠ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీఈసీ మీటింగ్‌లో రేవంత్, భట్టి, ఉత్తమ్ పాల్గొననున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై ...

Read More »

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిశారు.

Read More »

కేసీఆర్‌కు షాక్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు

ఏపీసీసీ జనరల్‌ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మద్దిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు.

Read More »