Tag Archives: delhi news

కరోనా ప్రభావిత నగరాల్లో ఢిల్లీ ముందంజ

దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావితమైన నగరాల్లో ఢిల్లీ తొలి వరుసలో ఉంది. కేసులు నమోదులో ఆర్థిక నగరాన్ని తన్ని దేశ రాజధాని ముందుకు వచ్చింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా వైరస్‌ కోరలు చాచుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా 2.0 వేవ్‌ నడుస్తుండగా.. ఢిల్లీలో మూడవ వేవ్‌ కొనసాగుతోంది. బుధవారం ఢిల్లీలో 17,282 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. దీంతో వీకెండ్‌ కర్ఫ్యూను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి విదితమే. ముంబయిలో ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన కేసులు ...

Read More »

10న నూతన పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన.. భవన విశేషాలు ఇవే!

93 ఏళ్లనాటి చరిత్ర కలిగిన ప్రస్తుత భారత పార్లమెంట్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి నిర్ణయించింది. ఈ నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు. దీన్ని 2022 నాటికి పూర్తి చేయాలని అంచనా వేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఈ నూతన భవనంలో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు ...

Read More »

రాజ్యసభ నుండి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు

ఎనిమిది మంది ఎంపిలపై సస్పెన్షన్‌ వేటును వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్షాలు మంగళవారం రాజ్యసభ నుండి వాకౌట్‌ చేశాయి. అనంతరం సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపిలకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు మూడు కీలక డిమాండ్లను కేంద్రం ఆమోదించేవరకు రాజ్యసభ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు.కాగా, సోమవారం రాజ్యసభలో సస్పెండ్‌ వేటు పడిన ఎంపిలు రాత్రి నుండి పార్లమెంట్‌ ఆవరణలోనే ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

Read More »

క్షమాపణ చెప్పేదిలేదన్న ప్రశాంత్‌ భూషణ్‌

 తాను దృఢంగా నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా చేసిన ట్వీట్లకు నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పినట్లైతే అది కోర్టు ధిక్కరణతోపాటు తన మనస్సాక్షిని కూడా ధిక్కరించినట్లవుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావిస్తూ ఆయనను దోషిగా తేల్చి, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సోమవారం వరకూ కోర్టు గడువిచ్చింది. దీనిపై తన ట్వీట్లను సమర్ధించుకుంటూ ప్రశాంత్‌భూషణ్‌ అఫిడవిట్‌ సమర్పించారు. క్షమాభిక్ష కోరనని, కోర్టు ఏ శిక్ష విధించినా ఆమోదిస్తానని మహాత్మాగాంధీ అన్న మాటలను ...

Read More »

ఢిల్లీ తాత్కాలిక ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సిఎం

ఢిల్లీ తాత్కాలిక ఆరోగ్య శాఖ మంత్రిగా డిప్యూటీ సిఎం

దేశ రాజధానిలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తాత్కాలికంగా ఆరోగ్య శాఖ, ఇతర విభాగాల బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల అధిక జ్వరం, శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన ...

Read More »

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఉత్తరాఖండ్‌కు చెందిన కేసులో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉద్యోగాలు, పదోన్న తుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సభ్యులు ఆందోళన చేశారు. ఈ అంశంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనలో స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే ...

Read More »

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓట్లలెక్కింపుప్రారంభమైంది. ఓట్లలెక్కింపు సందర్భంగా ఢిల్లీలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూజీ స్పోర్ట్సు కాంప్లెక్స్, ఎన్ఎస్ఐటీ ద్వారక, మీరాబాయి, జీబీపంత్ కాలేజీలు, రాజీవ్ గాంధీ స్టేడియం, సర్ సీవీ రామన్ ఐటీఐ, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు అర్వింద్ కేజ్రీవాల్ ఇంటికి తరలివస్తున్నారు.

Read More »