Tag Archives: dhanush

ఓటు వేసిన ర‌జ‌నీకాంత్‌, ధ‌నుశ్‌, విజ‌య్ సేతుప‌తి

లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి మొద‌టి ద‌శ‌ ఓటింగ్ శుక్ర‌వారం (ఏప్రిల్ 19న) ప్రారంభమైంది. త‌మిళనాడులో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొద‌టి ద‌శ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ పోలింగ్ బూత్‌లో త‌న‌ ఓటు వేశారు. ఆయ‌న‌తో పాటు నటులు ధనుశ్‌, విజయ్ సేతుపతి కూడా తమ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. నటుడు ధనుశ్ టీటీకే రోడ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్‌లో ఓటు వేయ‌గా, కిల్‌పాక్‌లోని చెన్నై హైస్కూల్‌లో విజయ్ సేతుపతి ఓటు వేశారు. ...

Read More »

త‌మిళ స్టార్ హీరో 50 వ సినిమాకు టైటిల్ ఫిక్స్…

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతుంటాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో పాటు కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డంలో ధనుష్ ముందుంటాడు. తాజాగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ధ‌నుష్ కెరీర్‌లో 50వ సినిమాగా ఇదీ రూపుదిద్దుకుంటోంది.అయితే రాయాన్ నార్త్ చెన్నై కథాంశంతో ధనుష్ తెరకెక్కించనున్నాడట. అయితే ఇప్పుడు ఆ చిత్రానికి సంభందించిన ఆప్డేట్ వచ్చేసింది. ఆ సినిమాకు రాయ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ...

Read More »

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌

ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తాజాగా.. శేఖర్‌కమ్ముల తన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుందని ఆయన వెల్లడించారు. లవ్‌స్టోరీ సినిమాను నిర్మించిన నిర్మాతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌రావులే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్‌ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రెయిట్‌ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ ఎవరు? మిగతా నటీనటులు ఎవరనేది.. చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుంది.

Read More »