Tag Archives: ec

షర్మిలకు ఈసీ నోటీసులు

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read More »

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

తక్కువ ఓటింగ్ నమోదవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఝార్ఖండ్, MP, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో 67.40% ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లోని పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.

Read More »

పెన్ష న్లపై కీలక అప్ డేట్

పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.

Read More »

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో ...

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర ...

Read More »