Tag Archives: election commission

ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల వ్యయ పరిమితి పెంచినట్లు ECI తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ. 95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుండి 13కు పెంచుతూ ...

Read More »

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును ప్రభుత్వం నియమించింది. ఈయన మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కనగరాజు వ్యవహరించారు. కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం ప్రచురించింది. శనివారం ఉదయం ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.

Read More »

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈసీ పై మండిపడ్డ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ చేత ఆమోదం పొందిన షెడ్యూల్‌ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు.స్థానిక ...

Read More »

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ రాజ్‌ భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇచ్చారు. సుమారు గంటకుపైగా సాగిన వీరిభేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్‌ కుమార్‌ నుంచి గవర్నర్‌ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం. అయితే గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు ...

Read More »