Tag Archives: elections

రేపే ఎన్నికల నోటిఫికేషన్..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

Read More »

ఆ ప్రచారంలో నిజం లేదు: ఎన్నికల సంఘం

ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఇకపై ఉండదనే ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయింది.

Read More »

ఆ ప్రాంతాలపై ఈసీ ఫోకస్

తక్కువ ఓటింగ్ నమోదవుతున్న 11 రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీనికి గల కారణాలపై CEC రాజీవ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిహార్, UP, ఢిల్లీ, ఉత్తరాఖండ్, TG, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, ఝార్ఖండ్, MP, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2019లో 67.40% ఓటింగ్ నమోదైంది. ఈ రాష్ట్రాల్లోని పట్టణాల్లో అత్యంత తక్కువ ఓటింగ్ నమోదవుతున్నట్లు గుర్తించారు.

Read More »

‘మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్’ పేరిట వెబ్‌సైట్ తీసుకువ‌చ్చిన ఈసీ

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస‌త్య ప్ర‌చారాన్ని అరిక‌ట్ట‌డానికి ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీ) కొత్త వెబ్‌సైట్‌ను తీసుకువ‌చ్చింది. మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను మంగ‌ళ‌వారం ప్రధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్ రాజీవ్ కుమార్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు జ్ఞానేశ్వ‌ర్‌ కుమార్‌, సుఖ్‌బీర్ సింగ్ సంధు ప్రారంభించారు. అస‌త్య స‌మాచార వ్యాప్తిని అరిక‌ట్టి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు క‌చ్చిత‌మైన స‌మాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్‌సైట్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా ఈసీ వెల్ల‌డించింది. ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అడిగే ప్ర‌శ్న‌ల‌ను, వెలుగులోకి వ‌చ్చిన న‌కిలీ స‌మాచారాన్ని ఈ ...

Read More »

‘టైమ్స్ నౌ సమ్మిట్ 2024’లో సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీ నాయకత్వం కోరినా ఈ కారణంగానే తిరస్కరించానని ఆమె వెల్లడించారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారని తెలిపారు. అయితే వారం, పది రోజులు ఆలోచించి పోటీ చేయడం తన వల్ల కాదని నిర్ణయించుకున్నానని, అదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని ఆమె ...

Read More »

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో ...

Read More »

పెండింగ్ సీట్లపై కూటమిలో కొనసాగుతున్న గందరగోళం..

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనా కూటమిలో పెండింగ్ సీట్లపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్ ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలో అనిశ్చితి నెలకొంది. దాదాపు 5 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ తమ అభ్యర్థుల ఇంకా ప్రకటించ లేదు. అదేవిధంగా ఒక ఎంపీ, 3 అసెంబ్లీ సీట్లను జనసేన పెండింగ్‌లో పెట్టింది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ ...

Read More »

ఏపీలో అందరూ ఎన్నికల రూల్స్‌ పాటించాల్సిందే: సీపీ రవి శంకర్‌

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్‌ పాటించాలన్నారు సీపీ రవి శంకర్‌. కొంత మంది పర్మిషన్‌ లేకుండా పొలిటికల్‌ మీటింగ్స్‌ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, విశాఖ సీపీ రవి శంకర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్‌ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్‌ ద్వారా పర్మిషన్‌ తీసుకోవాలి. ఒకవేళ యాప్‌ పనిచేయకపోతే రిటర్నింగ్‌ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్‌వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్‌, డోర్‌ టూ డోర్‌ ప్రచారానికి పోలీసులు అనుమతి ...

Read More »

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు విడుదలైన నోటిఫికేషన్

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీగా ఉంది. అయితే బీహార్‌లో 27న పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 ...

Read More »

ఎన్నికల వేళ వైసీపీ నేతలకు సీఎం జగన్ మార్గదర్శకాలు ఇవే

సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఓవైపు వైఎస్సార్సీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికల్లో తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు సీఎం జగన్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినందున నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. అభ్యర్థులంతా ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని దిశా నిర్దేశం చేశారు.

Read More »