Tag Archives: farmers

విజయవాడలో రైతుగర్జన ప్రారంభం

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్య‌వ‌సాయ‌చట్టాలకు వ్యతిరేకంగా, ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా ఎఐకెఎస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రైతుగర్జన ర్యాలీ సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైంది. వివిధప్రాంతాల నుండి ట్రాక్టర్లలో రైతులు, రైతుసంఘంనాయకులు నగరంలోని పడవలరేవు బిఆర్‌టిఎస్‌ రోడ్డు వద్దకు చేరుకున్నారు. అనంతరం ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. మోటారు సైకిళ్లపై కూడా ప్రజాసంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర నాయకులు ముజఫర్‌ అహ్మద్‌, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, తదతరులు ర్యాలీ అగ్రభాగంలో ...

Read More »

కేంద్రంతో కష్టం…రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని యోధుల్లా రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేందం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న చర్చలు ఫలించేలా కన్పించట్లేదన్న న్యాయస్థానం… సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. రైతుల ఆందోళనల విరమింప చేయాలని కోరుతూ రిషభ్‌ శర్మ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేయగా…మద్దతుగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ...

Read More »