Tag Archives: Harish Rao

ఒకే కారులో తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్, హరీశ్ రావు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకే కారులో కలిసి వచ్చారు. హరీశ్ రావు, కేటీఆర్‌లకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ పదిహేడు లోక్ సభ ...

Read More »

22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు.. కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు సంచలన ట్వీట్

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. జీతాల విషయంలో కాంగ్రెస్ చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అంటూ మండిపడ్డారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. ...

Read More »

కాళేశ్వరం పాపం ఆ ఇద్దరిదే.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం నుంచి నీటి తరలింపు ఆర్థిక భారం అని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని గతంలో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే నివేదిక ఇచ్చిందని… అయినా వాటిని పట్టించుకోకుండా మేడిగడ్డ కట్టారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పురుగు పుట్టిందే కేసీఆర్ పుర్రెలో అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు కానీ ఆయనే ...

Read More »

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీనియర్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు కడియం శ్రీహరిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కడియం చాలా సీనియర్ ఎమ్మెల్యే అనీ, ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు. కానీ కోమటిరెడ్డి మాట్లాడిన తీరు సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చిన ...

Read More »

చిన్న సంఘటనను భూతద్దంలో చూస్తున్నారు..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని, దానిని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పారు. మిగతా బ్యారేజీలను కూడా చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన మేడిగడ్డ సందర్శన యాత్రపై హరీశ్ రావు అసెంబ్లీ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ...

Read More »

కరీంనగర్ ప్రజలు తరిమికొడితే పాలమూరు వలస వచ్చారు..!

ఒకాయనను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమికొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్ నగర్ వాసులు ఆయనను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీశ్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ...

Read More »

కార్మికులతో కలిసి అల్పహారం చేసిన హరీష్ రావు

కార్మికులతో కలిసి అల్పహారం చేసిన హరీష్ రావు

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పారిశుధ్య కార్మికులను శుక్రవారం ఉదయం సన్మానించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. కొండమల్లయ్య గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్‌ పోరులో పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు.

Read More »

నాయి బ్రాహ్మణులకు సూచనలు ఇచ్చిన మంత్రి హరీష్ రావు

నాయి బ్రాహ్మణులకు సూచనలు ఇచ్చిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కేంద్రంలో సోమవారం పర్యటించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆయన పండ్లు అందించారు. దాంతోపాటు నాయి బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులస్తులకు మంత్రి సలహాలు, సూచనలు ఇచ్చారు. హెయిర్‌ కటింగ్ చేసేటప్పుడు శానిటేషన్‌ చేయడం తప్పకుండా అలవాటు చేసుకోవాలని చెప్పారు. కటింగ్‌కు ముందు, తర్వాత కటింగ్‌ చేయించుకునే వ్యక్తి, చేసే వ్యక్తి డెటాల్‌ లేదా ...

Read More »

హోలీ వేడుకల్లో పాల్గొన్నమంత్రి హరీష్ రావు

హోలీ వేడుకల్లో పాల్గొన్నమంత్రి హరీష్ రావు

నేడు తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సిద్దిపేటలో జరిగిన హోలీ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ నిర్వహించారు. స్వయంగా ఇంటింటా తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వాలని హరీష్‌రావు మున్సిపల్ వార్డుల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Read More »

కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు!

కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు!

టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ...

Read More »