Tag Archives: heavy rains

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు: వాతావరణ శాఖ

ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలహీనపడుతుండటంతో ఆగష్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వివరించింది. గత ఏడాది ఎలినినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈసారి మాత్రం నైరుతి సీజన్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే సమ్మర్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని తేల్చిచెప్పింది.

Read More »

నివర్‌ తుఫాన్.. భారీగా కురుస్తున్న వర్షాలు

నివర్‌ తుపాన్‌ బుధవారం తీరం దాటింది. పుద్చుచేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుండి తీవ్ర తుపానుగా బలహీనపడింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి, గురువారం తెల్లవారు జామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాన తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు 100-110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అవి గంటకు 120 వేగం వరకు పుంజుకుంటాయని వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో వచ్చిన ఏడు రకమైన తుపానుల్లో..ఇది ఐదవదని, బలమైనదని చెప్పారు. ...

Read More »

నేడు మరో అల్పపీడనం

ఈశాన్య బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ విభాగం– అమరావతి తెలిపాయి. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read More »