Tag Archives: IPL

ఢిల్లీ వరుస విజయాలు.. హైదరాబాద్‌ వరుస పరాజయాలు.. గెలుపెవరిది?

ఐపిఎల్‌ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ స్టేడియం మంగళవారం మరో పోరుకు సిద్ధమైంది. రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. రెండు వరుస పరాజయాలతో సతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఢిల్లీ దూసుకుపోతుంటే.. అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేస్తూ సన్‌రైజర్స్‌ డీలాపడిపోయింది. ఢిల్లీ గెలిచినా, సన్‌రైజర్స్‌ ఓడినా హ్యాట్రిక్‌ నమోదు కానుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పూర్తిగా ...

Read More »

ఐపిఎల్‌ 2020లో రాహుల్‌ (132) తొలి సెంచరీ..

పంజాబ్‌ ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌లో విజృంభించాడు. దుబారు ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ సెంచరీ బాదాడు. కేవలం 62 బంతుల్లోనే 100 పరుగులు చేసిన రాహుల్‌ మ్యాచ్‌ ముగిసే సరికి 132 (69) పరుగులు చేశాడు. ఐపిల్‌-13 సీజన్‌లోనే తొలి సెంచరీ చేసిన క్రికెటర్‌గా రాహుల్‌ పేరు నమోదు చేసుకున్నాడు. మొదటి నుంచీ రాహుల్‌ దాటిగానే ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి పవర్‌ ప్లే ఓవర్లు నిలకడగా ...

Read More »

ఐపిఎల్‌కు దుబాయ్‌ ముస్తాబు.. చెన్నై-ముంబై మధ్య ఫస్ట్‌ మ్యాచ్‌!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) రానే వచ్చింది. మార్చి 29 నుంచే మొదలవ్వాల్సిన ఐపిఎల్‌.. కరోనా కారణంగా వాయిదా పడింది. టి20 ప్రపంచకప్‌ కూడా వాయిదా పడటంతో ఐపిఎల్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే భారత్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం, దుబాయ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఐపిఎల్‌-2020 లీగ్‌ను యుఎఇలో సెప్టెంబరు 19 నుంచి నిర్వహించేందుకు బిసిసిఐ నిర్ణయించింది. దీంతో కరోనా వల్ల ఇళ్లకే పరిమితమైన జనాలకు ఇప్పుడు ఈ లీగ్‌ కాస్త ఊరట కలిగిస్తుందని ...

Read More »