Tag Archives: jagan

జగన్‌పై ప్రశంసలు కురిపించిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టిడిపి కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్‌ జగనే కారణమని అన్నారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టిడిపి కాపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Read More »

ఏపీలో కాంగ్రెస్ జగన్ తో కలిస్తేనే .. తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమా? పీకే చెప్పినంత మాత్రాన జగన్ పొత్తుకు సై అంటారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పీకే ఇచ్చిన రిపోర్ట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయంలో పీకే కీలక భూమిక పోషించారు. ఎవరిని చేర్చుకోవాలి…. ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి.. ప్రత్యర్థులను ఎలా ఢీకొట్టాలన్నదానిపై గతంలో జగన్ కు కీలక సూచనలు చేశారు పీకే.

Read More »

పేదలకు సంక్షేమ పథకాలు ఆపేయాలని ఎల్లో బ్యాచ్ అంటోంది : జగన్

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని టీడీపీ చెబుతుందని జగన్ ఆరోపించారు. ఈ పథకాలు రద్దు చేస్తే ప్రజలు ఒప్పుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు పాలన కావాలని దుష్టచతుష్టయం ప్రయత్నాలు చేస్తుందని జగన్ మండిపడ్డారు.

Read More »

‘ఆచార్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా జగన్‌..!

 ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏప్రిల్‌ 23న విజయవాడలోని సిద్దార్థ జూనియర్‌ కాలేజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎపి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రానున్నాడు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

Read More »

కేబినెట్‌లో 8 మంది పాతవారిని కొనసాగించే అవకాశం!

మంత్రివర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తుది కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నారు. కొత్తగా అధికారం చేపట్టనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా లేఖలు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత కేబినెట్‌ నుంచి 8 నుంచి 10మందిని కొనసాగించే అవకాశం ఉంది. కుల సమీకరణ, కొత్త జిల్లాను పరిగణనలోకి తీసుకుని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. 

Read More »

‘ఎల్లో పార్టీ, మీడియాల కడుపు మంటకు మందే లేదు’: జగన్‌

పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గన్న ఆయన.. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్న జీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో ...

Read More »

ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై జగన్‌ ఆగ్రహం

టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఎపిని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ తనకు ...

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవతరణ

సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్‌.జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలు, 26 జిల్లాలుగా పున: వ్యవస్థీకరణయ్యాయి.  కొత్త జిల్లాల ఏర్పాటును  సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ కూడా, ప్రతి ఒక్కరికీ సిఎం జగన్‌ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

Read More »

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన జగన్‌

అధునాతన వసతులతో రూపొందించిన వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ (102) వాహనాలను సిఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఈ వాహనాలను తహశీల్దార్లు, విఆర్‌ఒల పర్యవేక్షణలో ఆయా జిల్లాలకు పంపించనున్నారు.

Read More »

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు : జగన్‌

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఎపి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కుాభూ రక్ష ‘ పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు.అనంతరం జగన్‌ మాట్లాడుతూ గతంలో వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులను కూడా తయారు చేయాలన్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం ...

Read More »