Tag Archives: janasena

పవన్ కి రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలి: హరి రామజోగయ్య

టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 40-60 స్థానాలు కేటాయించాలని, లేదంటే ఓట్ల బదిలీ సవ్యంగా జరగదని కాపు ఉద్యమ నేత హరి రామజోగయ్య అభిప్రాయపడ్డారు. పవన్కు రెండున్నరేళ్లు CM పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించాలని కోరారు. JSP సపోర్టు లేకుండా TDP మెజార్టీ సీట్లు దక్కించుకోలేదని 2019 ఫలితాల్లో వెల్లడైందన్నారు. YCPని అధికారం నుంచి దించడమంటే TDPకి రాజ్యాధికారం అందించడం కాదుగా? అని ప్రశ్నించారు.

Read More »

జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి ఉందన్నారు.

Read More »

చిరంజీవి మాకే మద్దతిస్తారు..అధికారం మాదే: సోము వీర్రాజు..!!

జనసేనకు చిరంజీవికి అండగా ఉంటారంటూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు తెర తీసాయి. అది ముగియక ముందే ఇప్పుడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు మరో సారి ఏపీ రాజకీయాల్లో చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చారు. 2024లో బీజేపీ, జనసేన కూటమికి నటుడు చిరంజీవి మద్దతిస్తారని ప్రకటించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ...

Read More »

జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేనతో బిజెపికి ఎలాంటి పొత్తు ఉండదని బిజెపి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి వల్లే వరదసాయం ఆగిందని చెబుతున్న కేసీఆర్‌ దమ్ముంటే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని సవాల్‌ విసిరారు. వరదసాయంపై బిజెపిపై టిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని, తన సంతకాన్ని ...

Read More »

ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న పవన్

ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను జనసేనాని కలవనున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీ పెద్దల భేటీలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై నిశితంగా చర్చించనున్నారు. సీట్ల పంపకాలు, ఎవర్ని ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి..? అనే విషయాలపై ఇవాళ సాయంత్రం లోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

Read More »