Tag Archives: kavitha

నేటితో ముగియనున్న కవిత జుడీషియల్ కస్టడీ

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ED, CBI ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరుపర్చనున్నాయి. కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరనున్నాయి. మరోవైపు ఈడీ అరెస్ట్ప కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును జడ్జి మే 2కు వాయిదా వేశారు. సీబీఐ అరెస్ట్ప వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు నిన్న ప్రారంభం కాగా నేడూ కొనసాగనున్నాయి.

Read More »

క‌విత‌కు మ‌రోసారి షాక్‌.. బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వాయిదా!

సీబీఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌స్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో క‌విత‌ను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న‌ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ ...

Read More »

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఆమె విచారణ వాయిదా పడింది. అయితే ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని, తనపై అక్రమంగా కేసు పెట్టారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు ...

Read More »

శరత్ చంద్రారెడ్డి ఐదు మద్యం రిటైల్ జోన్లు కవిత ఇప్పించారన్న సీబీఐ

ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలు పేర్కొంది. అరబిందో గ్రూప్‌కు చెందిన శరత్ చంద్రారెడ్డికి ఐదు మద్యం రిటైల్ జోన్లు ఇప్పించడంలో ఆమె కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ప్రతిఫలంగా ఆర్థిక లబ్ధి పొందారని తెలిపింది. అంతేకాదు, తాను డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే తెలంగాణ వ్యాపారం చేయలేవంటూ ఆయనను కవిత బెదిరించారని పేర్కొంది. ఐదు జోన్లు తనకు ...

Read More »

జైల్లో కవితను విచారించనున్న సీబీఐ..

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నేడు అరెస్ట్ చేసింది. ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఇప్పుడు సీబీఐ ఆమెను తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది. సీబీఐ గత ఏడాది హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది. ఆమెను మరోసారి విచారించేందుకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అనుమతి తీసుకుంది. ఈ క్రమంలో ఆమెను ఈరోజు కస్టడీలోకి తీసుకుంది. కవితను పది రోజుల పాటు ...

Read More »

సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉంది. కవితను జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను విచారించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ నుంచి తమకు కౌంటర్ రిప్లై అందలేదని కవిత తరపు లాయర్ చెప్పగా… ఆ అవసరం లేదని సీబీఐ బదులిచ్చింది. శనివారమే కవితను తాము ప్రశ్నించామని… కాబట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ...

Read More »

ఏప్రిల్ 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు… రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నిన్న ...

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత ...

Read More »

క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగింపు..

లిక్క‌ర్ కేసులో ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీ ముగియడంతో ఎమ్మెల్సీ క‌విత‌ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను మ‌రో 5 రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగించింది. అంత‌కుముందు త‌మ విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో కిక్ బ్యాక్‌లు అందాయ‌ని ఈడీ పేర్కొంది.క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు ...

Read More »

కవిత అరెస్ట్ పై విజయశాంతి స్పందన

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. కవిత అరస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ సినీ నటి విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు కాలం కర్మను నిర్ణయిస్తుందని… ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. నిజనిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ… తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ...

Read More »