Tag Archives: kcr

రెండో రోజు ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. సూర్యాపేట నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం భువనగిరిలో రోడ్డు షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సూర్యాపేట నుంచి భువనగిరి వచ్చే మార్గమధ్యలో అర్వపల్లి, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. కేసీఆర్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనగాం మీదుగా కేసీఆర్ భువనగిరి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు భువనగిరిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు ...

Read More »

పరువు తీయడానికే పద్మారావును కేసీఆర్ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టారు: రేవంత్ రెడ్డి

పద్మారావు పరువు తీయడానికే అతడిని కేసీఆర్ సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పద్మారావు నామినేషన్ దాఖలుకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. దీనిని బట్టే ఆయనకు వాళ్లు మద్దతివ్వడం లేదని అర్థమవుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్‌ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బుధవారం సీఎం సికింద్రాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

Read More »

ఏపీలో మళ్లీ జగన్ గెలుస్తారు: KCR

APలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ‘ఏదో ఒక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తారు. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఆలోచిద్దాం’ అని తెలిపారు.

Read More »

BRS పేరు మార్పుపై KCR కీలక వ్యాఖ్యలు

పార్టీ పేరును BRS నుంచి TRSగా మళ్లీ మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై KCR కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పట్లో పార్టీ పేరు మార్పు సాధ్యం కాదు. ఇటీవలే TRS పేరును BRSగా మార్చాం. ఇంత త్వరగా మళ్లీ పార్టీ పేరును మార్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకోదు. ఈసీ నిబంధనల ప్రకారం పేరు మార్చాలంటే 5-6 ఏళ్ల గ్యాప్ ఉండాలి. అయినా పేరు మార్చే ఆలోచన, అవసరం కూడా లేదు’ అని KCR స్పష్టం చేశారు.

Read More »

ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు. తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ...

Read More »

ఈనెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Read More »

కేసీఆర్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తాజాగా ఈ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూప‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న గులాబీ ...

Read More »

ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై స్పందించిన కేసీఆర్

ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ...

Read More »

BRS అభ్యర్థులకు ఈనెల 18న బీఫామ్‌ల అందజేత

బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులను ఈనెల 18వ తేదీన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఫామ్‌లు అందజేయనున్నారు. అంతేగాకుండా.. ఎన్నికల ఖర్చుల నిమిత్తం అభ్యర్థులకు నియమావళిని అనుసరించి రూ.95 లక్షల రూపాయల చెక్కును అందించనున్నారు. అనంతరం అదేరోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసన సభ్యులు, ఎంఎల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్ పీ ...

Read More »

నేడు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ సంగారెడ్డి సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనుంది. పార్టీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నారు.

Read More »