Tag Archives: kodali nani

తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్:కొొడాలి నాని

గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతున్నారని విమర్శించారు.

Read More »

ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన చంద్రబాబు : కొడాలి నాని

ఏపీలోని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. పొత్తుల పేరిట ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల కోసం మూడురోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు కాశారని ఆరోపించారు. మతతత్వ పార్టీ బీజేపీ అంటూ విమర్శించిన చంద్రబాబు 2014లో మరోసారి బీజేపీ మిలాఖతై పోటీ చేసి 2019లో మోదీపై ఆరోపణలు చేస్తూ దూరమయ్యారని అన్నారు. ఏపీ భవిష్యత్‌ అంటూ నాటకం ఆడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలతో సిగ్గు ...

Read More »

ఇవే నాకు చివరి ఎన్నికలు: కొడాలి నాని

తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను ఎన్నికల్లో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటా. నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదు. నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

Read More »

సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారన్న కొడాలి నాని

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ను గోతిలో పాతిపెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లా వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు బుద్ధి చెప్పాలని కోరారు. నారా లోకేశ్ ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని చెప్పారు. లోకేశ్ ను సీఎం చేయాలనే దురుద్దేశంతో జూనియన్ ఎన్టీఆర్ పై అనేక కుట్రలు చేస్తూ, ఇబ్బందులు ...

Read More »

జూ.ఎన్టీఆర్‌పై కుట్ర?.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ ధ్వజమెత్తారు. ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలన్నారు. అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Read More »

ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలే.. కొడాలి నాని

ఏపీ సెక్రటేరియట్ ను జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెడ్డడం సాధారణ విషయమేనని చెప్పారు. సచివాలయం అనేది కేవలం పదెకరాల ఆస్తి మాత్రమేనని అన్నారు. ఈ ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాశారా ...

Read More »

2024లో చంద్రబాబుకు రెస్ట్ ఇద్దాం..!

ఇన్నేళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్నారు… ఆయనకు రెస్ట్ ఇద్దాం… ఈ సారి నన్ను గెలిపిస్తారా? అంటూ ఆయన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో సరదా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కుప్పంలో ఎన్టీఆర్ క్యాంటీన్ ను ప్రారంభించిన భువనేశ్వరి… ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, సరదాగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానని కూడా ఆమె చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుని సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ నేత కొడాలి నాని ...

Read More »

ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక వైసీపీ ‘సిద్ధం’ అని బహిరంగ సభలు ప్లాన్ చేస్తే ‘యుద్ధం’ చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్, చంద్రబాబుకు తెలియదు. సీఎం జగన్ 175 స్థానాల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించారు. జనసేన ఎన్ని ...

Read More »

గుడివాడ టికెట్ ఎవరికో జగన్ చెపుతారు.. పకోడీగాళ్లకు ఏం సంబంధం?

ఏపీలో అధికార వైసీపీలో మార్పులు, చేర్పులు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగులకు పార్టీ హైకమాండ్ మొండి చేయి చూపించింది. కీలక నేతలకు కూడా సీట్లు దక్కక పోవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచిన కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. ఈసారి గుడివాడ టికెట్ ను నానికి ఇవ్వడం లేదనే వార్తలు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఆయన స్థానంలో మండవ హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారనే ...

Read More »

బాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు- కొడాలి నాని

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతి భ్రమించింది. ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేక జగన్ ను తిడుతున్నారు. 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ కి పంపించేశారు. సీట్లు రాని, మేము తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నారు.వైసీపీ కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని తెలిపారు. పదవీ ...

Read More »