Tag Archives: ktr

కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటీఆర్ విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసుకోవాలని, లేకపోతే ప్రజలు వారిని ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అహంకారమే కారణమన్నారు.

Read More »

రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం ...

Read More »

మంత్రి కెటిఆర్‌ కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని, టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని మంత్రి కెటిఆర్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి తీసుకున్న అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలిపారు. బుధవారమే కెటిఆర్‌ కు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలను నిర్వహించారు. గురువారం వాటన్నింటినీ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందని డాక్టర్లు తెలిపారు.

Read More »

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో ...

Read More »

గెలుపోటములు సహజం : కెటిఆర్

రాజకీయాల్లో గెలుపు… ఓటములు సహజం.  విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందిన తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో మంగళవారం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి గల కారణాలపై లోతుగా సమీక్షిస్తామని కెటిఆర్ అన్నారు.   ఆరున్నరేళ్లలో చాలా విజయాలు సాధించాం. దుబ్బాకలో మేం ఆశించిన ఫలితం రాలేదు. ...

Read More »

శ్రీనివాస్ ఘటనపై స్పందించిన కేటీఆర్

కారుతో సహా వాగులో గల్లంతైన టీఆర్‌ఎస్‌ నేత జంగపల్లి శ్రీనివాస్‌ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ల‌పల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండ‌గా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో స‌హా వాగులో ప‌డిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా… కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు.విషయం ...

Read More »

కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

నేడు పవిత్ర రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడికి అప్యాయంగా రాఖీ కడుతూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన వెళ్లిన కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. 

Read More »

మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, ...

Read More »

సెప్టెంబర్‌ కల్లా బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి: కేటీఆర్‌

అండర్‌ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్‌ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్‌ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్‌ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్‌ వరకు బాలా నగర్‌ ప్లై ఓవర్‌ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష ...

Read More »

తాగునీటి పథకానికి కేటీఆర్‌ శ్రీకారం

తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) కరీంనగర్‌లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 24 గంటల తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ మానేరు తీరంలో మొక్కలు నాటారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో నిత్యం తాగునీటిని‌ అందించడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుందని తెలిపారు. 2048 ఏడాది నాటికి సరిపడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని ...

Read More »