Tag Archives: Narendra Modi

పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ‘పారదర్శక పన్నుల విధాన వేదిక’ ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ...

Read More »

యువతకు ప్రధాని మోదీ సందేశం

కోవిడ్‌–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్‌ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు. వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్‌ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల ...

Read More »

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటీ

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ భేటీ

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బుధవారం సాయంత్రం ఈ భేటీ ప్రారంభమైంది. వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వంటి కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే ఏప్రిల్‌ 20 తరువాత దేశంలోని పలు ప్రాంతాల్లో​ లాక్‌డౌన్‌ను సడలించనున్న నేపథ్యంలో దీనిపై కూడా ప్రధాని మంత్రులతో చర్చించనున్నారు.

Read More »

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభమైంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రానున్నాయి

Read More »

జనతా కర్ఫ్యూ: లైవ్‌లో సందడి చేస్తోన్న 28 మంది టాలీవుడ్ స్టార్స్

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలంతా ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ను పాటిస్తున్నారు. దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే, ఇళ్లలో ఖాళీగా కూర్చున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా టాలీవుడ్ స్టార్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా పలకరిస్తున్నారు. వాళ్లతో ముచ్చటిస్తున్నారు. ‘మనందరి కోసం’ అనే స్లోగన్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే ఈ లైవ్‌లు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మంచు లక్ష్మితో ...

Read More »

ప్రధాని మోదీని కలిసిన జగన్.. గంటన్నర పాటూ చర్చలు

ప్రధాని మోదీని కలిసిన జగన్.. గంటన్నర పాటూ చర్చలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గంటన్నర పాటూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో సమావేశమయ్యారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా ప్రధానిని కలిశారు. ముందు జగన్ ఎంపీలతో కలిసి 50 నిమిషాల పాటూ కీలక అంశాలపై చర్చించారు. తర్వాత మోదీతో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి బయల్దేరారు. వాస్తవానికి అమిత్ షాను కలవాల్సి ఉన్నా.. ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో తిరుగు ...

Read More »