Tag Archives: nayanatara

నయనతార వివాహతేదీ ఎప్పుడంటే…?!

 ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ నయనతార త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్‌ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలపై నయన్‌ స్పందించి.. ‘నా పెళ్లికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకార్లే. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను. అప్పటివరకు ఎలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు’ అని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల జూన్‌ 9న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు ...

Read More »

బస్సులో సమంత, నయన్‌తార

స్టార్‌ కథానాయకులు సమంత, నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతువకుల రెండు కాదల్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్‌ బాయ్ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియో ఒకటి నెటింట్లో వైరల్‌గా మారింది. బస్సులో హీరో, హీరోయిన్లు ప్రయాణీస్తున్న ఈ సీన్‌ను పలువురు మొబైల్లో తీసి..సోషల్‌ మీడియాలో పెట్టడంతో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సమంత, నయన్‌ ఇద్దరూ కూడా తెల్ల రంగు చీరలు కట్టుకుని బస్సు ఫుట్‌బోర్డుపై ఉండగా ...

Read More »

‘ఆహా’లో నయనతార ‘నీడ’

తమిళంలో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నిజల్‌’ మూవీకి తెలుగానువాదం ‘నీడ’. ఈ సినిమా జులై 23న ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. నయనతార, కుంచాకో బోబన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, అప్పు ఎన్‌.భట్టతిరై ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. నితిన్‌ అనే చిన్నారి సాయంతో జాన్‌ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఎలా చేధించాడు? అనేది ఈ సినిమా కథాంశం.

Read More »

మూడు సినిమాలతో రాబోతున్న నయనతార

నయనతార నటించిన మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలోనూ ఈ లేడి సూపర్ స్టార్ నుంచి మూడు సినిమాలు రాబోతుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారట. గత ఏడాది కరోనా సమయంలోనే ‘ముక్కుత్తి అమ్మన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అమ్మవారిపాత్రలో నయన్ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా వరుసగా ...

Read More »

నయనతార సినిమాలో జాన్వీ కపూర్‌!

‘ధడక్‌’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీకపూర్‌ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కి విజయం సాధించిన తమిళచిత్రం ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్‌లో నటించనుంది. ఆనంద్‌ ఎల్‌ రారు నిర్మించనున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ సేన్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 9 నుంచి పంజాబ్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. ఒకే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Read More »

ప్రియుడితో కలిసి గోవా ట్రిప్‌లో నయనతార!

కథానాయిక నయనతార ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉన్నారు. ఈ ట్రిప్‌ను ఫుల్‌గా ఎంజారు చేస్తోందట అమ్మడు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటలోను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయాన్ని ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారనుకోండి. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్‌ తరుచూ పోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుండటం కూడా వీరి బంధానికి బలం చేకూరుస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు వారు రిలేషన్‌లో ఉన్నారని. ఇప్పుడు ...

Read More »