Tag Archives: ntr

ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా… రిలీజ్ డేట్ వాయిదా…

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. సినిమా ప్రారంభం రోజే కొరటాల శివ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ లో గాయపడ్డంతో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ గాయం నుంచి కోలుకొని రావడానికి కనీసం నెల రోజులకి పైనే సమయం పడుతుంది. అతను వస్తేగాని షూటింగ్ కంప్లీట్ కాదు. ...

Read More »

దిగొచ్చిన స్టార్‌ హీరోలు

టాలీవుడ్‌ బంద్‌ నిర్ణయంతో స్టార్‌ హీరోలు దిగొచ్చారు. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండటంతో ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో  సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ నిలిచిపోనున్నాయి.  ఈ నిర్ణయంపై  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు స్టార్‌ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్‌టిఆర్‌; రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామని దిల్‌ ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ...

Read More »

20న ఒటిటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Read More »

ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ నటి !

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అయితే ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటించనున్నది. ఒక ఇంటర్వ్యూ లో దీపికా మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్‌ తో నటించే అవకాశం కోసం వచ్చిందని, చాలా రోజులగా ఆయన పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. ఆయన నటన అంటే తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక కొరటాల ఆఫర్‌ రాగానే వెంటనే దీపికా ...

Read More »

ఎన్టీఆర్‌ – కొరటాల సినిమా 

జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతాగ్యారేజ్‌’ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. తాజాగా వీరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నారు. 

Read More »

కొరటాలతో ‘ఎన్‌టిఆర్‌ 30’

టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్‌ 30’కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఘన విజయంపై అందరికీ ధన్యవాదాలు తెలిపే మీడియా ఇంటరాక్షన్‌ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తానని, జూన్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. షూటింగ్‌ ప్రారంభించడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని ప్రారంభిస్తానన్నారు. ఆ సినిమా కోసం బరువు తగ్గబోతున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఫైనల్‌ స్క్రిప్టు గురించి ఎన్టీఆర్‌, కొరటాల ...

Read More »

అమృత్‌సర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఆదివారం గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది చిత్రబృందం. సినిమా మంచి విజయం సాధించాలని అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ...

Read More »

RRR ఆరు రోజులు టూర్‌

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రమోషన్‌లో భాగంగా ఆరు రోజులు పాటు దేశంలోని రాష్ట్రాల్లో ప్రచారం పెట్టుకుంది చిత్రబృందం. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా లొకేషన్ల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది. దుబాయ్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్‌సర్‌, జైపూర్‌, కోల్‌కతా, వారణాసి, హైదరాబాద్‌ నగరాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. కోవిడ్‌ కారణంగా తరచూ వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.

Read More »

19న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

ఈ నెల 19న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేసినట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేశారు మేకర్స్‌.  కర్ణాటకలోని చిక్కబల్లాపురలో శనివారం సాయంత్రం 6 గంటలకు చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని కేవిఎన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ వీడియోను విడుదల చేస్తూ వెల్లడించింది. 

Read More »