Tag Archives: parliament

నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవంబర్ చివరి వారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సారి సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. ఆర్థిక రంగానికి చెందిన రెండు కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు. పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) చ‌ట్టం-2013 స‌వ‌ర‌ణ బిల్లు, దీంతో పాటు బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం-1949 స‌వ‌ర‌ణ బిల్లు ను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోనున్నారు. అటు ...

Read More »

పార్లమెంటులో ఆగని రైతు పోరు..

పార్లమెంటు ఉభయసభలూ బుధవారం నాడు కూడా రైతు సమస్యలపై దద్దరిల్లాయి. మోడీ ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెండు సభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో లోక్‌సభ వాయిదాల బాట పట్టింది. రాజ్యసభ ఒకసారి వాయిదా పడింది. ఈ సభలో ఇద్దరు ఆప్‌ సభ్యులు సస్పెండ్‌కు గురయ్యారు. మధ్యాహ్నాం నాలుగు గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ...

Read More »

25 మంది ఎంపిల‌కు కరోనా..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొదటిరోజున నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మంది స‌భ్యు‌ల‌కు పాజిటివ్‌గా నిర్థారణైంది. మీనాక్షిలేఖి, అనంత్‌కుమార్‌ హెగ్డే, పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, పార్లమెంటు సమావేశం మొదటిరోజున సుమారు 200 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. సందర్శకుల గ్యాలరీలో మరో 30 మంది ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Read More »

నేటి నుండి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభకానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సమావేశాలకు ముందు సాంప్రదాయబద్దంగా నిర్వహించే అఖిల పక్ష సమావేశం రద్దు చేయబడింది. రెండు దశాబ్దాలలో అఖిల పక్ష సమావేశాన్ని రద్దు చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. కాగా, అక్టోబర్‌ 1తో ముగిసే ఈ సెషన్‌ ఎజెండాపై చర్చించేందుకు స్పీకర్‌ ఓంబిర్లా నేతృత్వంలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి నేత అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధిర్‌ రంజన్‌ ...

Read More »

నేటి నుంచి పార్లమెంట్‌ మలి విడత సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ మలి విడత సమావేశాలు

పార్లమెంట్‌ రెండో విడుత బడ్జెట్‌ సమావేశాలు నేటీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో వ్యవహరించిన వ్యూహాలను అధికార, ప్రతిపక్షాలు రచిస్తున్నాయి. ఇటీవలి ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మతోన్మాద హింస, దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. అలాగే బడ్జెట్‌ (డిమాండ్స్‌ అండ్‌ గ్రాంట్స్‌)పై రెండో దశ చర్చ జరుగుతుంది.33 రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ...

Read More »

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

సుప్రీం తీర్పుపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఉత్తరాఖండ్‌కు చెందిన కేసులో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉద్యోగాలు, పదోన్న తుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో సభ్యులు ఆందోళన చేశారు. ఈ అంశంపై కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి ప్రకటనలో స్పష్టత లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే ...

Read More »