Tag Archives: Srisailam

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు..

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీ స్వామివారికి అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ముందు గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాల నడుమ ...

Read More »

క్రమంగా పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 ,62,30,472 రూపాయల నగదు లభించింది. ఈ ఆదాయాన్ని ...

Read More »

శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు….

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో పాతాళగంగ వద్ద తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదుల ఏర్పాటు చేయాలని…. ట్రాఫిక్, పార్కింగ్, త్రాగునీరు, వైద్యం సదుపాయాలను కల్పించాలని.. అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఏపీ నుంచి 500 బస్సులు, తెలంగాణా నుంచి ...

Read More »

శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు…..

శ్రీశైలం మహా క్షేత్రంలో నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు సూచనలు చేశారు. బుధవారం క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా,ట్రాఫిక్‌, పార్కింగ్‌,విద్యుద్దీకరణ, క్యూలైన్ల నిర్వహణ, పాతాళగంగలో స్నానఘట్టాలు,తాత్కాలిక శౌచాలయాలు వంటి ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ఏర్పాటు చేయాలని,అదే విధంగా ...

Read More »

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,01,818 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్‌ ఫ్లో 4,96,497గా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ...

Read More »

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు.అయితే మరీ కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి ...

Read More »

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పోటెత్తింది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రాజెక్టులోకి 3.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 881.30 అడుగుల్లో 195.21 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి భారీ ఎత్తున వరదను విడుదల చేసిన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 79,131 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 71,321 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి ...

Read More »

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటినుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం క్షేత్రంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని ఆలయ ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. 14వ తేదీ నుంచి 24 వరకు ఉత్సవాలకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్టు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ దర్శన వేళల్లో మార్పులు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 18 నుంచి 22వ తేదీ వరకు మన్ననూర్‌ అటవీ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలకు ఉన్న ఆంక్షలు తొలగించనున్నట్టు చెప్పారు.

Read More »