Tag Archives: supreme court

అనిల్ అంబానీకి షాక్!

ఒకప్పుడు అపరకుబేరుడిగా ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు.. ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది

Read More »

కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ ఆమె కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులు కొట్టేసి.. తనను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ)ని ఈ పిటిషన్‌లో కవిత ప్రతివాదిగా చేర్చారు. కాగా, కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఎల్లుండి ...

Read More »

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టబద్దమైన నీటి వాటాను ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. శ్రీశైలం డ్యామ్ లో తక్కువ నీరున్నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసుండడం వల్ల ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగా విరుద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రజల జీవించే హక్కును ...

Read More »

పరీక్షలపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!

స్టేట్‌ బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అఫిడవిట్‌ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. పరీక్షలకు నిర్వహణకు సంబంధించి స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం కరోనా సమయంలో భౌతికంగా పరీక్షలు నిర్వహిస్తే.. దీని వలన ఒక్క విద్యార్థి మరణించినా, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎఎం.ఖాన్‌విల్కర్‌, దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం స్పష్టం ...

Read More »

క్షమాపణ చెప్పేదిలేదన్న ప్రశాంత్‌ భూషణ్‌

 తాను దృఢంగా నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా చేసిన ట్వీట్లకు నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పినట్లైతే అది కోర్టు ధిక్కరణతోపాటు తన మనస్సాక్షిని కూడా ధిక్కరించినట్లవుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా భావిస్తూ ఆయనను దోషిగా తేల్చి, బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సోమవారం వరకూ కోర్టు గడువిచ్చింది. దీనిపై తన ట్వీట్లను సమర్ధించుకుంటూ ప్రశాంత్‌భూషణ్‌ అఫిడవిట్‌ సమర్పించారు. క్షమాభిక్ష కోరనని, కోర్టు ఏ శిక్ష విధించినా ఆమోదిస్తానని మహాత్మాగాంధీ అన్న మాటలను ...

Read More »

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. రేపు రెగ్యులర్‌ లిస్ట్‌లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. అలాగే స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో సైతం ఇప్పటికే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. తాండవ యోగేష్‌, జనార్ధన్‌ అనే ఇద్దరు వ్యక్తులు ...

Read More »